కొత్త అమావాస్య కొత్త అమావాస్య రోజున ఏమి చేయాలి ?
'కొత్త అమావాస్య' అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు. ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి , ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. సరైన సమాధానం లభించక సతమతమైపోతుంటారు. అయితే శాస్త్రాన్ని అనుసరించి నడచుకునే వాళ్లకి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది.
'ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ? ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించాలనే విషయంలో తర్జనభర్జనలు పడుతుంటారు. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.
సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం , తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడుతోంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments
Post a Comment