భక్తి సంకుచితమైతే
భక్తి సంకుచితమైతే
చైనాలో ఒక భక్తురాలు ఉండేది. బుద్ధుడు అంటే ఆమెకు ఎనలేని ప్రేమ, సాటిలేని భక్తి ఉండేది. తన ఆస్తిపాస్తులన్నిటినీ అమ్మేసి, వచ్చిన డబ్బుతో మేలి బంగారపు బుద్ధ విగ్రహాన్ని ఆమె తయారు చేయించింది. అయినవారందరినీ వదిలేసి సహస్ర బుద్ధ మందిరానికి వెళ్ళి, అక్కడే సన్యాసినిగా జీవించసాగింది.
అదొక పెద్ద ఆలయం. ఒక భారీ పర్వతాన్ని ఆలయంగా మలిచారు. అందులో వెయ్యి బుద్ధుడి విగ్రహాలు ఉండేవి కాబట్టి దాన్ని ‘సహస్ర బుద్ధ ఆలయం’ అని పిలిచేవారు. తనతోపాటు తెచ్చుకున్న స్వర్ణ బుద్ధుణ్ణి ఆమె అక్కడే కొలువుతీర్చింది. రోజూ భక్తి శ్రద్ధలతో పూజించేది. పూజలో సువాసన వెదజల్లే చాలా ఖరీదైన అగరుబత్తిలను ఈ విగ్రహం ముందు వెలిగించేది. ఆ సువాసనను తన ఇష్టదైవం.. అంటే ఆ బంగారు ప్రతిమ మాత్రమే ఆస్వాదించాలనేది ఆమె కోరిక. కానీ అగరుబత్తిల పొగ తన బుద్ధుడివైపు కాకుండా.. ఆలయంలో ఉన్న ఇతర బుద్ధ విగ్రహాల వైపు వెళ్తూ ఉండేది. ఇది ఆమెకు నచ్చేది కాదు. కేవలం తన బుద్ధుడికి మాత్రమే ఆ సువాసన చేరాలంటే ఏం చేయాలా? అని రాత్రింబవళ్ళు తీవ్రంగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే దాన్ని అమలుచేసింది.
ఒక గొట్టాన్ని తయారు చేసి, దాన్ని తన బంగారు బుద్ధ విగ్రహం ముందు పెట్టింది. వెలిగించిన అగరు బత్తిలను ఆ గొట్టంలో అమర్చింది. సువాసనను మోసుకొచ్చే పొగ నేరుగా ఆ బుద్ధుడి ముక్కులోకి వెళ్ళే ఏర్పాటు చేసింది. ఆ పొగ తన బుద్ధుడివైపే వెళుతూ ఉంటే చూస్తూ ఆమె ఎంతో ఆనందిస్తూ ఉండేది. కానీ కొద్దిరోజులకే ఆ ఆనందం దుఃఖంగా మారింది. కారణం ఏమిటంటే.. ఆమె రోజూ అలా చేయడం వల్ల.. ఆ బంగారు బుద్ధుడి ముఖం మసిబారిపోయింది, కళావిహీనంగా మారింది. ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉండే ఆ ముఖం నల్లగా, దుఃఖభరితంగా కనిపించింది. దాన్ని ఎంత శుభ్రపరిచినా ఇదివరకటి కళ లేదు. దీంతో ఆమె ఎంతో ఆందోళనతో, ఆవేదనతో.. ఆ ఆలయ ముఖ్య పూజారి దగ్గరకు వెళ్ళింది. ఆయనను తీసుకువచ్చి, తన బంగారు బుద్ధుణ్ణి చూపించింది. ‘‘నా స్వామి, నా బుద్ధుడు ఎలా అయ్యాడో చూడండి. నేను ఏం చేస్తే నా బుద్ధుడు మళ్ళీ ప్రకాశిస్తాడో చెప్పండి’’ అని ఏడుస్తూ వేడుకుంది.
‘‘అమ్మా! ఇది నీవు ఒక్కదానివి మాత్రమే చేసే తప్పు కాదు. లోకంలో ప్రతి మూఢ భక్తుడు తన ఇష్టమూర్తిని సంకుచిత ధోరణితో ఇలాగే మసిపూసి, మసకబారుస్తున్నాడు’’ అని ఆమెను ఆయన ఓదార్చాడు.
తన బుద్ధుడే అసలైన బుద్ధుడనీ, ఆయనకు మాత్రమే తన ఆరాధన మొత్తం చేరాలనీ, ఆలయంలో ఇతర బుద్ధ ప్రతిమలకు చేరకూడదనీ ఆమె సంకుచితంగా వ్యవహరించింది. అదే ఆ బంగారు బుద్ధుణ్ణి అందవిహీనుడిగా చేసిందనీ, ఇలాంటి సంకుచిత భక్తి, ప్రేమ దుఃఖాన్నే మిగులుస్తాయనే బోధ ఆయన మాటల్లో ఉంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment