మార్చి 29న షష్ట గ్రహకూటమి

 


మార్చి 29న షష్ట గ్రహకూటమి

మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి 29-03-2025 21:38 నుండి 30-03-2025 16:34 వరకు ఉంటుంది.  మార్చి 29న, మీన రాశిలో అరుదైన మరియు శక్తివంతమైన షష్ట గ్రహ కుటమి (ఆరు గ్రహాల సంయోగం) సంభవిస్తుంది. సంవత్సర ఆద్యంత సంధిలో (క్రోధి ఫాల్గుణ అమావాస్య నుండి విశ్వావసు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది) షష్ఠగ్రహ కూటమి సంభవిస్తోంది. ఇది వ్యక్తిగత, సామాజిక మరియు ప్రపంచ స్థాయిలో గణనీయమైన విపత్తులకు దారితీస్తుంది. ఈ గ్రహకూటమి వలన సునామీలు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు వైరల్ వ్యాప్తి, ఆర్థిక సంక్షోభాలు మరియు ఆరోగ్య రుగ్మతలతో సహా తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తుంది. సూర్య-చంద్ర-బుధ-శుక్ర-శని-రాహువులు  మొత్తం ఆరు గ్రహాలు ఒక (మీన)రాశిలో ఉంటున్నాయి.  సంయోగంలో ఆరు కీలకమైన గ్రహ శక్తులు ఉంటాయి:

 రవి (సూర్యుడు) – రాబోయే “విశ్వావసు సంవత్సరం”లో ఆత్మ కారకుడు, రాజు, సేనాధిపతి మరియు అర్ఘ్య నాయకుడు, పాలన మరియు నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈకుటమి లో రవి కలయిక అస్సలు మంచిదీ కాదు. అంతేకాకుండా, అదే రోజున సూర్యగ్రహణం (భారతదేశంలో కనిపించకపోయినా) ఈ ఖగోళ సంఘటన యొక్క ప్రతికూల ప్రభావాన్ని విశేషంగా పెంచుతుంది.

చంద్రుడు (చంద్రుడు) – భావోద్వేగాలను మరియు మానసిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే మనస్సు కారకుడు.

బుధుడు (బుధుడు) – మేధో కారకుడు, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తాడు.

శుక్రుడు (శుక్రుడు) – సౌభాగ్య మరియు లక్ష్మీ కారకుడు, సంపద మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తాడు.

శని (శని) – కర్మకారకుడు, విధిని, కష్టాలను, విధ్వంసాలను ప్రభావితం చేస్తాడు. శని గ్రహం అర్ధరాత్రి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది.

రాహువు – పిశాచ తత్వాన్ని (ప్రతికూల అంశాలు) సూచిస్తాడు, గందరగోళం మరియు భ్రమను కలిగిస్తాడు.

ఏప్రిల్ 13 వరకు పంచగ్రహ కూటమి కొనసాగనుంది. ఈ పంచ గ్రహ కూటమి వల్ల ఏకరాశౌ యదా యాంతి చత్వారః పంచ ఖేచరాః ,చత్వారో రాష్ట్ర నాశాయ-హంతి పంచ జగత్రయం. యదా ఏకరాశౌ చత్వారః ఖేచరాః యాంతి  రాష్ట్ర నాశనమ్ నాలుగు గ్రహాలు ఒకే రాశి లో ఉంటే రాష్ట్ర నాశనం అని పంచ ఖేచరాః ఏకరాశౌ యదా యాంతి జగత్రయం హంతి ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే మూడు జగాలు నశిస్తాయి. అని శాస్త్రవచనము.  యదా షడ్గ్రహాః సంయాంతి ఏకరాశౌ నిసర్గతః, రోగపీడాదిదుర్భిక్షం జలవృష్టేరసంయమః, నృపాణాం మిత్రభేదశ్చ యుద్ధం చ భవేద్ధృవం || ఆరు గ్రహాలు కేవలం రెండు రోజులు మాత్రమే మీన రాశిలో ఉంటున్నాయి. అందులో చంద్రుడు బలహీనుడై ఉన్నాడు.  కాబట్టి చెడు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.  కానీ పంచగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 నుండి పంచగ్రహ కూటమి లేదు. కాబట్టి ఏప్రిల్ 14 నుండి మంచి జరుగుతుంది. పరిస్థితులు చక్కబడతాయి. 

మొత్తం ఎనిమిది గ్రహాలు కేతువును చూస్తున్నాయి అంటే చంద్రుడు, శని, బుధ, శుక్ర, రవి, రాహువులు సప్తమ వీక్షణతో కేతువును చూస్తున్నారు, గురు గ్రహం పంచమ వీక్షణతో కేతువును చూస్తున్నాడు, కుజ గ్రహం స్తంభన స్థితిలో ఉంది.  చతుర్ధ వీక్షణతో కేతువును చూస్తున్నాడు. శని గ్రహం తృతీయ వీక్షణ నుండి గురు గ్రహాన్ని చూస్తున్నాడు. అంటే కేతు గ్రహం ఒకరకంగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. జలవిపత్తులు, సునామీలు, అకాలవర్షాలు, భూకంపాలు, భయంకరమైనా వైరల్ ఇన్ఫెక్షన్లు, భారీ ఆర్థిక నష్టాలు, కొత్త యుద్ధాలు ఇలా ఎన్నో మనము వూహించని విపత్తులు జరగవచ్చు.

నివారణ చర్యలు- ఈ సమయంలో (మార్చి 29 నుండి ఏప్రిల్ 14 వరకు)  గ్రహకూటమి యొక్క ప్రతికూల, దోష ప్రభావాలను తగ్గించడానికి, ప్రతి ఒక్కరూ దైవ ధ్యానం, దుర్గాదేవిస్తుతి, వేద క్రతువులను నిర్వహించడం, వేదపారాయణలు, పురాణపారాయణలు, విష్ణుసహస్రనామ పారాయణలు, సుందరకాండ పారాయణలు, హనూమాన్ చాలీసా పారాయణలు తప్పనిసరిగా చేసుకోవాలి. భగవంతుని యందు విశ్వాసం పెట్టి పని చేయాలి.  బాధ్యతల యందు  ఏకాగ్రతతో శ్రద్ధగా వారి వారి లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. 

యూట్యూబ్ –fb, ఇస్టా మరియూ వాట్సప్ మాధ్యములందు రాబోవు షష్ఠగ్రహకూటమీ వలన ఫలానరాశికి ఇబ్బందులు  అని భయపెట్టు విషయములను మనము స్వికరించవలసిన అవుసరము లేదు. షష్ఠగ్రహ కూటమి అనేది దేశారిష్ఠయోగము గురించి తెలియజేయు అంశము. వ్యక్తిగత జాతకములకు వర్తించదు. 

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము