వివాహ పొంతన-వైవాహిక జీవితం

వివాహ పొంతన-వైవాహిక జీవితం
ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వివాహం నిశ్చయించడానికి ముందుగా వివాహ పొంతన చూస్తాం. వీరిద్దరికి వివాహం చేస్తే వీరు కలిసిమెలిసి జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తారా లేదా అనేది వివాహ పొంతన తెలియజేస్తుంది. దీనికోసం వర్ణ, వశ్య, దిన, యోని, గణ, రాశి, గ్రహమైత్రి,
నాడి, అనే అష్టకూటములు పరిశీలించాలి అనే ప్రాథమిక నియమం ఉంది. వివాహ పొంతనలో కొన్ని నిఘూడమైన అంశాలు కూడా దాగి ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఇటువంటి రహస్యాలను కూడా పరిశీలించి వివాహ పొంతన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు అబ్బాయి నక్షత్రము అశ్విని, అమ్మాయి నక్షత్రము అనురాధ వీరిద్దరికీ వశ్య పొంతన బాగున్నది యోని పొంతన బాగున్నది దీనిని 75% వివాహ జీవితం బాగుందని తీర్మానిస్తారు. కానీ వివాహం అనంతరం అబ్బాయి వేరే స్త్రీల పట్ల ఆకర్షితుడై భార్యను నిర్లక్ష్యం చేస్తాడు. భార్యాభర్తల మధ్య నిరంతరం సమస్య ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో ఒక సూక్ష్మ రహస్యాన్ని కూడా పరిగణ లోనికి తీసుకోవాలి అబ్బాయి జాతకంలో రాజ్యాధిపతి గ్రహం అమ్మాయి జాతకంలో నీచ పొందినప్పుడు ఈ అబ్బాయికి భార్యపట్ల ఆకర్షణ తగ్గిపోతుంది అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరు రెండు నక్షత్రాల యొక్క గణాలు లేదా పాయింట్లు అని చూస్తారు ఇవి 18 నుండి 36 మధ్యలో వస్తే వివాహ జీవితం బాగుంటుందని తీర్మానం చేస్తారు. ఉదాహరణకు అబ్బాయి నక్షత్రము పూర్వాషాడ,అమ్మాయి నక్షత్రం మూల ఈ రెండు నక్షత్రాల మధ్య గణాలు లేదా పాయింట్లు 27 వచ్చినవి. వీరిద్దరికీ వివాహం చేస్తే కలిసిమెలిసి ఉంటారు అని తీర్మానించకూడదు. అబ్బాయి లగ్నం కర్కాటకం రాజ్యాధిపతి కుజుడు. అమ్మాయిది సింహాలగ్నం అమ్మాయి జాతకంలో కుజుడు కర్కాటకంలో ఉండి నీచ పొందినాడు. వివాహం జరిగిన ఆరు నెలలకే వీరిద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోయి దూరమవడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రంలో అనేక సూక్ష్మ రహస్యాలు దాగి ఉంటాయి. వివాహ పొంతన పరిశీలించే సమయంలో వ్యక్తిగత జాతకాలు కూడా పూర్తిగా పరిశీలించి వివాహ పొంతన చేసినప్పుడు వారి ఇరువురి దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతుంది. వివాహ పొంతన చేసేవారు ఇటువంటి సూక్ష్మ విషయాలను కూడా పరిశీలించాలి.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment