రాశిఫలాలు - మార్చి 1,2025
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు మతపరమైన, సామాజిక కార్యక్రమాలకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ బంధువులతో ఎవరితోనైనా లావాదేవీ చేయాలని ఆలోచిస్తుంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సాయంత్రం నుండి రాత్రి వరకు, మీ ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం ఉన్నందున మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈరోజు తమ జీవితంలో అనేక అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు. బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు ఎవరికైనా అప్పు ఇస్తే, ఆ డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మిధున రాశి
ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం మీ సోదరుడి సహాయం తీసుకోవచ్చు. ఉద్యోగులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ కుటుంబ సభ్యునితో విభేదాలు తలెత్తితే, మీరు మౌనంగా ఉండటం మంచిది. మీరు ఈరోజు ఏదైనా పని చేస్తే, దానిలో ఓపిక పట్టాలి. అప్పుడే అది విజయవంతమవుతుంది. మీరు ఏదైనా పని తొందరపడి చేస్తే భవిష్యత్తులో మీకు కొన్ని సమస్యలు రావొచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా విషయాల్లో తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇతరుల తప్పులను వెతకడం వంటి పనులు చేయకండి. ఎందుకంటే మీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించాలి. కాబట్టి మరొకరు తప్పు అని మీరు అనకూడదు. మరోవైపు ఈరోజు ఆస్తిని కొనుగోలు చేస్తే అది భవిష్యత్తులో మీకు అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సాయంత్రం, మీ పిల్లల విద్యతో సంబంధం ఉన్న సీనియర్ సభ్యుడిని కలవడానికి వెళ్ళొచ్చు.
సింహ రాశి
సింహ రాశి వారు ఈరోజు తమ సంపాదనలో కొంత భాగాన్ని తమ విలాసాల కోసం ఖర్చు చేస్తారు. ఇది చూసి, మీ కుటుంబ సభ్యులు కూడా మీపై అసూయపడతారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు, మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీరు కొన్ని విలువైన వస్తువులను పొందొచ్చు. వ్యాపారులు ఈ రోజంతా లాభాలను పొందుతూనే ఉంటారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. అయితే సాయంత్రం నుండి రాత్రి వరకు, మీరు కొన్ని అవసరమైన ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవి మీకు ఇష్టం లేకపోయినా చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈరోజు మీ పిల్లల విద్యకు సంబంధించిన కొంత సమాచారాన్ని వింటారు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మరోవైపు మీ మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలను ఆపాలి. అప్పుడే మీ పనులన్నింటినీ సులభంగా పూర్తి చేయగలుగుతారు.
తులా రాశి
వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీకు అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. ఈరోజు సాయంత్రం, మీ ఉద్యోగంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వారు ఈరోజు సోదరులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఈరోజు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ సాయంత్రం, మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఇది మీ విజయానికి తోడ్పడుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. దీంతో మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం అవుతుంది. మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. దీని వలన మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీ భావాలను ఇతరులకు వ్యక్తపరిచే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. పని ప్రాంతంలో ఎవరితో అయినా విభేదాలుంటే, అవి కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఒక చిన్న పార్టీని కూడా నిర్వహించొచ్చు. ఈరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలొస్తాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈరోజు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందించొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషంగా ఉంటుంది.మీ పిల్లల పురోగతి మీ కుటుంబ ఖ్యాతిని పెంచుతుంది. దీంతో మీరు చాలా సంతోషిస్తారు. ఈరోజు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
మీన రాశి
వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ పిల్లలు, భార్య పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు తమ నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలొస్తాయి.
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#rasiphalalu #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments
Post a Comment