ధన ప్రవాహము-జాతక విశ్లేషణ

ధన ప్రవాహము-జాతక విశ్లేషణ జాతకులలో కొందరికి ధన ప్రవాహం అనేది జరుగుతుంది అనగా ఎల్లప్పుడూ అవసరానికి తగిన ధనం లభిస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా అప్పులు చేయవలసిన పని ఉండదు. చేసినప్పటికీ వెంటనే తీరిపోతాయి. ఇటువంటివారి జాతకాలలో గ్రహాల అమరిక ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. లగ్నాత్తు రెండవ అధిపతి మూడవ అధిపతికి సంబంధం ఉన్నప్పుడు అనగా ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్న లేదా పరివర్తన ఉన్నా వీళ్ళకి నిరంతర ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా కుజుడు ధనాధిపతికి సంబంధం ఏర్పడినప్పుడు వీరి జాతకంలో ధన ప్రవాహం ఉంటుంది. ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. అదేవిధంగా భాగ్యాధిపతి లాభాధిపతి పై దృష్టి ఉన్న లేదా కలిసి ఉన్న జాతకులకు కూడా అత్యధిక ధనం లభిస్తూనే ఉంటుంది. కొద్ది రోజులలో ఏదో ఒక పెద్ద ధనానికి సంబంధించిన అవసరం ఉంటే ఆ సమయానికి ధనం వెంటనే లభిస్తుంది. వ్యాపారం చేసేవారైతే లాభాలు ఆకస్మికంగా రావడం లేదా ఏదో విధంగా ధనం అయితే లభిస్తుంది. లేదా జాతకంలో గురు భగవానుడు లాభాధిపతిని కలిసినా,లాభాధిపతి పై దృష్టి ఉన్నా ఈ జాతకులకు ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా తృతీయ అధిపతి తొమ్మిదో అధిపతిని కలిసినా దృష్టి ఉన్న, లేదా ఆ స్థానాలను చూస్త...