రాశి ఫలాలు (31/12/2024)



మేషం                                                                                                                                                      


పనిభారం పెరిగినప్పటికీ, సమర్థతతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించండి. స్నేహితుల సహకారం లభిస్తుంది. నవగ్రహ మంత్రాలు జపించడం శుభఫలితాలను ఇస్తుంది.


వృషభం

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించాలి. శ్రమ ఎక్కువవుతుందే కానీ, విజయాలు సాధిస్తారు. దుర్గాదేవిని ఆరాధించండి.


మిథునం

ఉత్సాహంగా పని చేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందనే విశ్వాసం ఉంచండి. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి.


కర్కాటకం

శుభకార్యక్రమాలకు అనుకూల సమయం. మీ తెలివితేటలతో లాభాలను పొందగలుగుతారు. కలహాలకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందుకు సాగం ఇష్టదేవతను దర్శించడం శ్రేయస్సును అందిస్తుంది.


సింహం

మీ ప్రతిష్టను పెంచే అవకాశాలు దక్కుతాయి. ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో చిత్తశుద్ధితో వ్యవహరించండి. సూర్యనారాయణుడు అనుగ్రహిస్తాడు.


కన్య

సంఘంలో గౌరవం పొందుతారు. శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించండి. ఆర్థిక లాభాలు ఉంటాయి.మీకు ఇష్టమైనవారితో ఆనందకర సమయాలను గడుపుతారు. దుర్గాదేవి స్తోత్రం చదవండి.


తుల

మీ మనోధైర్యం మిమ్మల్ని విజయతీరాలకు తీసుకెళ్తుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు చర్చకు వస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించండి.


వృశ్చికం

మీ చుట్టూ సానుకూల వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చించవచ్చు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం.


ధనుస్సు

ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ధార్మికతకు ప్రాధాన్యం ఇస్తారు. కీలక నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం చదవండి.


మకరం

శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే శుభఫలితాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. శని ధ్యానం చేయండి.


కుంభం

కుటుంబ సభ్యుల సహకారం మీకు మార్గం చూపుతుంది. చేపట్టిన పనులను మనోధైర్యంతో విజయవంతంగా పూ చేస్తారు. శ్రీగణపతిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.

మీనం 

 వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబానికి ఆనందాన్ని అందించే శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కనకధారాస్తోత్రం చదవండి.

సర్వేజనా సుఖినో భవంతు 
  1. శుభమస్తు
    వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

    #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology #havaneja #jathakam

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి?