శివాలయాలు విశేషాలు




 

🙏 ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్ క్షేత్రం🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸పంచకేదార్ దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివదేవాలయం. ఈ దేవాలయాన్ని వేసవి కాలంలోమాత్రమే చూడగలం. దైవ దర్శనం వల్ల చాలా కాలంగా జరగక ఆగినపనులన్నీ జరుగుతాయని ప్రజలు నమ్ముతారు.


🌿అందువల్లే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెలుతుంటారు. ఈ క్రమంలో కౄరమృగాలుఎదురైనా లెక్కచేయరు. ఇక చలికాలంలో ఆ దేవాలయంలోని గర్భగుడి మొత్తం మంచుతో మూసుకుపోతుంది.


🌸అందువల్లే ఆ దేవదేవుడి ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లోని మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలుచేస్తారు. తిరిగి వేసవి రాగానే ఆ ఆలయ గర్భగుడి ద్వారాలు తెరుచుకొంటాయి.


🌿పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయం కేదర్నాథ్ దేవాలయం కంటే అత్యంత ఎత్తులో ఉండటం గమనార్హం. ఈదేవాలయంలోని ఆ పరమశివుడి దర్శనానికి ఒంటరిగా కంటే బృందాలుగా వెల్లడమేమేలు.


🌸ప్రపంచంలో అత్యంత ఎతైన ప్రదేశంలో ఉన్న దేవాలయం తుంగనాథ దేవాలయం. ఇది మన భారత దేశంలోనే ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కేవలం వేసవి కాలంలో మాత్రమే వీలవుతుంది.


🌿ఆ సమయంలో పరిసర ప్రాంతాలు హరనామ స్మరణతో మారుమ్రోగుతాయి.


🌸దేవతలు నివశించే హిమాలయ రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లోని తుంగనాథ దేవాలయం రుద్రప్రయాగ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు కాలినడకన మాత్రమే చేరుకోగలము.


🌿డోలీలు అందుబాటులో ఉంటాయి. వాతావరణ పరిస్థితులను అనుసరించి ఛార్జీల్లో కొంత మార్పులు ఉంటాయి.


🌸ఇక దేశ రాజధాని ఢిల్లీ నుంచి తుంగనాథ దేవాలయం చేరాలంటే సుమారు 304 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యంత కఠిన ప్రయాణ మార్గం. అందుకే ముసలివారు ఇక్కడికి వెళ్లడానికిసాధారణంగా అనుమతించరు.


🌿ఈ అద్భుత దేవాలయం సముద్రమట్టం నుంచి 1273 అడుగుల ఎత్తులో ఉంటుంది. మందాకిని, అలకనంద నదుల మధ్యన కొలువైన ఈ దేవాలయం భారత దేశంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. అత్యంత పురాతన శిల్పాలను కూడా ఈ ఆలయ గోడల పై చూడవచ్చు.


🌸తుంగనాథ దేవాలయాన్ని పంచకేదార మందిరాల్లో ఒకటిగా చెబుతారు. ద్వాపర యుగానికి ఈ దేవాలయానికి అవినాభావ సంబంధం ఉంది. కేదర్నాథ్ దేవాలయం నిర్మించిన సమయంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.


🌿కురుక్షేత్ర యుద్ధంలో పంచపాండవులకు బ్రహ్మహత్యా దోషం పట్టుకొంటుంది. దోషం నుంచి విముక్తి కోసం ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి చాలా చోట్ల తిరుగుతారు. ఈ సమయంలో చాలా అవాంతరాలు ఎదురైనా వారు లెక్కచేయరు.


🌸అయితే వారికి ఆ పరమశివుడి దర్శనం కనిపించదు. చివరికి నారదుడి ద్వారా హిమాలయాల్లో గుహాక్షి అన్న చోట ఉన్నాడని తెలుసుకుంటారు. అక్కడికి ప్రయాణమైన పంచపాండవులు మార్గమధ్యలో చాలా చోట్ల శివుడికి దేవాలయాలు కట్టించారని పురాణాలు చెబుతాయి.


🌿ఆ పరమశివుడిని దర్శించుకోవడం కోసం పాండవులు హిమాలయాలకు వెలుతారు. అయితే పరమశివుడు మాత్రం కురుక్షేత్రంలో తమ సొంత సోదరులను చంపారన్న కోపం ఉంటుంది. అందుకే సులభంగా వారికి దర్శన భాగ్యం కల్పించకూడదని నిర్ణయించుకొంటాడు.


🌸దీంతో ఆ పరమశివుడు పాండవులకు దొరక్కుండా ఆ పరమశివుడు నంది రూపంలో తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా పాండవులు పట్టు విడవరు.


🌿పరమేశ్వరుడిని దర్శించే వెను తిరగాలనుకొంటారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాలను, పరీక్షలను పంచపాండవులు సహనంతో ఎదుర్కొంటారు.


🌸ఈ విధంగా నంది రూపంలో తిరుగుతున్న పరమశివుడు ఒకసారి అనుకోకుండా భీముడికి ఎదురుపడుతాడు. అసాధరణ తేజస్సుతో ఉన్న ఆ నందిని భీముడు కొద్దిసేపు తదేకంగా చూస్తాడు. పరమశివుడు మాత్రం వారికి దర్శనం ఇవ్వకూడదనే అనుకొంటాడు.


🌿ఆయన పరమశివుడే అని భావించి ఆ నందిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే పరమేశ్వరుడు భీముడికి చిక్కకుండా అద`ష్యమైపోయి ఐదు చోట్ల ఐదు రూపాల్లో నిలిచిపోతాడు.


🌿ఆ ఐదు చోట్ల శివుడి శరీర భాగాలు పడ్డాయని కూడా స్థానికులు చెబుతారు.


🌸ఈ విషయం తెలుసుకొన్న పాండవులు ఆ ఐదు చోట్ల ఐదు శివాలయాలు నిర్మించి శివుడిని ఆరాధిస్తారు. అవే వరుసగా కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్.


🌿వీటిని పంచకేదారాలు అని అంటారు. ఇవి హిందువులకే కాకుండా నేపాల్ కు చెందిన వారికి కూడా పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలు.


🌸నేపాల్ లోని ఘోరక్ నాథ్ తెగవారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులు కూడా ఈ యాత్ర చేయడం అత్యంత పుణ్యఫలమని చెబుతారు.


🌿అందుకే వేసవి కాలంలో నేపాల్ దేశంలో ఉన్న హిందువులు ఈ పంచ కేదార యాత్రకు బయలు దేరి వస్తారు.


🌸ఈ పంచ కేదారాల్లో రెండవదే తుంగనాథ్. శివుని చేతులు లింగ రూపంలో వెలిసిన క్షేత్రం తుంగనాథ్. కేదర్నాథ్ కంటే ఎతైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం.


🌿ఈ ఆలయంలో లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపునకు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివుడితోపాటు వ్యాస గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి.

🌸ఇక దేవాలయం గోడల పై పండవులు గీచినట్లు చెప్పబడే అనేక చిత్రాలను చూడవచ్చు.


🌿ప్రమద గణాల విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆలయానికి కుడివైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెనుకవైపున ఐదు ఆలయాలు ఉంటాయి. వీటిని పంచకేదార ఆలయాల నమూనాలు అని పిలుస్తారు.


🌸వీటిని పంచ కేదారాల నమూనా ఆలయాలు అంటారు. ఇక తుంగనాథ ఆలయాన్ని అర్జునుడు స్వయంగా నిర్మించాడని ప్రతీతి. ఇక్కడ శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు.


🌿గర్భగుడితో పాటు ఆలయ శిఖరం మంచుతో కప్పబడి ఉండటమే ఇందుకు కారణం.


🌸ఉత్సవ విగ్రహాలను సమీపంలోని ముకునాథ్ మఠానికి తరలించి పూజిస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని ప్రతి ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది. ఈ సమయంలోనే భక్తులు ఈ తీర్థయాత్ర చేస్తారు.


🌿ఈ తుంగనాథ దేవాలయానికి దగ్గరగా మందాకినీ నది, అలకనంది నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రశిల పర్వతం కూడా ఉంది. వేసవి కాలంలో ఈ తుంగనాథ్ పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో మెరిసిపోతూ ఉంటాయి.


🌸ఈ పవిత్ర క్షేత్రానికి దగ్గర్లో ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ దగ్గరగా ఉన్న జాలీ గ్రాండ్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.


🌿ఇక తుంగనాథ్ కు దగ్గరగా హరిద్వార్ రైల్వేస్టేషన్ ఉంది. వీటి మధ్య దూరం 225 కిలోమీటర్లు...


స్వస్తి....🙏🌹


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025