పిల్లలు పుట్టటానికి సంకటహర చతుర్థి వ్రతం
సాధారణంగా చాలా మందికి వివాహమైన పిల్లలు కలగకపోవడంతో ఎన్నో బాధలు పడుతుంటారు.ఈ విధంగా సంతానం కలగడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు.
అయినప్పటికీ కొందరికి పిల్లలు కలగక పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.అదేవిధంగా సంతానం కలగని వారికి, అదేవిధంగా పుత్ర సంతానం కావాలని కోరుకునే వారు తప్పకుండా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తే తప్పకుండా పుత్రసంతానం కలుగుతారని గణపతి పురాణంలో తెలియజేయడమైనది.
పుత్ర సంతానం కలగాలంటే.. ఈ వ్రతం ఆచరించాలి.
గణపతి పురాణం ప్రకారం పూర్వం కృతవీరుడు అనే మహారాజుకి ఎంతో అందమైన భార్య ఉండేది.అదేవిధంగా కృతవీరుడు ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ దానధర్మాలు చేస్తూ, ఎల్లప్పుడు ప్రజా సేవ చేస్తూ ఉండేవాడు.
అయితే కృత వీరుడిని నిత్యం ఒక సమస్య వెంటాడేది.అతనికి పిల్లలు కలగకపోవడం అతనిని తీవ్ర నిరాశ పరిచింది.
సంతానం కోసం వారు చేయని పూజలు లేవు.అయితే ఒకరోజు తనకు సంతానం కలిగే ఉపాయాన్ని తెలియజేయమని కృతవీరుడు నారదుని సలహా అడుగుతాడు.
పిల్లలు పుట్టటానికి సంకటహర చతుర్థి వ్రతం
నారదుడు తగిన ఉపాయం వెతుకుతూ కృత వీరుడి పితృ లోకాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కృతవీరుడు తండ్రి, తాత,ముత్తాతలు నరక బాధలను అనుభవిస్తుంటారు.నారదుడు వారి దగ్గరకు వెళ్లి మీ కుమారుడికి సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పమని అడగగా అందుకు వారి తండ్రి, తాతలు కృత వీరుడిని సంకష్టహర చతుర్థి వ్రతం చేయడంతో అతనికి సంతానం కలగడమే కాకుండా, మాకు నరక బాధలు తొలగిపోతాయని చెబుతారు.ఈ విషయమై నారదమహర్షి కృప వీరుడికి తెలియజేశాడు.
నారద మహర్షి భూలోకానికి వెళ్లి కృత వీరుడితో నీకు సంతానం కలగాలంటే సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలని తెలిపాడు.అయితే ఈ వ్రతం ఆచరించడానికి అనువైన సమయం శ్రావణమాస బహుళ చవితి రోజు కానీ లేదా మాఘమాస బహుళ చవితి రోజు గాని ఆచరించాలి.
ఈ రెండు రోజులు కాని నేపథ్యంలో మంగళవారం ఉదయం తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.భక్తిశ్రద్ధలతో గణపతిని నమస్కరించుకుని, మహా మంత్రాన్ని జపించాలి.
ఈ వ్రతంలో తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్డూలు, మోదకాలను, తెల్ల జిల్లేడులను, గరికను సమర్పించడం పూజ చేయాలి.ఈ వ్రతం ఆచరించే సమయంలో స్వామివారికి గరిక సమర్పించక పోతే ఈ వ్రతం వృధా అవుతుందని నారదమహర్షి కృత వీరుడికి తెలిపాడు.
ఈ విధంగా సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించడంవల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని గణపతి పురాణంలో తెలియజేయడమైనది.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment