దేవుడికి పూజలు చేసేవారంతా దైవభక్తులైపోతారా.??


 

దేవుడికి పూజలు చేసేవారంతా దైవభక్తులైపోరు


నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారే దైవభక్తులు. 


భక్తి ఉన్నవాడు పాపం చేయడు, చేయలేడు. 

ఎందుకంటే 

దైవం ధర్మప్రియుడు.


ధర్మాన్ని తప్పితే భక్తి అనిపించుకోదు. 

భక్తికి ధర్మం ప్రాణం. 


గుళ్ళూ గోపురాలు తిరిగేవారు, 

దేవుడి పూజలు చేసేవారందరూ భక్తులేనని చెప్పడానికి లేదు.


తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు, 

అలా కొందరు దేవుడ్ని కొలుచుకొంటారు.


వారికి దేవుడి పట్ల అసలైన శ్రద్ధ ఉండదు. 

వారందరినీ 'భక్తులు' అనే వర్గం క్రింద జమకట్టకూడదు.


అలాగే ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని వాడుకొని సొమ్ము చేసుకొనే వ్యాపారులు ఉంటారు.


వారినే భక్తులనుకోవడం పొరపాటు. 

పాపం ఉన్నచోట భక్తి పండదు.

దైవశక్తి జాగృతం కాదు.


దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవత్వం పట్ల ఆసక్తి ఉండదు.


భక్తుడు భగవంతుని నామ, గుణ మహిమల పట్ల ప్రేమ కలిగి, 

నిరంతరం ఆ చింతనలోనే కాలం గడుపుతూ సత్యం, అహింస, శుచి, దయ వంటి సద్గుణాలను అలవరచుకుంటాడు. 


నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది.

ధర్మం, ప్రేమ ఈ రెండూ కలిస్తేనే 'భక్తి'.


'మంది' చేరే చోట సొమ్ము చేరుతుంది.

ఆ సొమ్ముని స్వాహా చేయడానికి అక్రమార్జనపరులూ చేరతారు.


అదేవిధంగా దేవుడి సొమ్మును స్వాహా చేసే మహాపాపాత్ములూ బయలుదేరతారు.


అలాంటి కొంతమంది దేవాలయాల్లో ఉన్నంతమాత్రాన భక్తులై పోరు.

వారి పాపాలూ పరిహరింపబడవు.


సరికదా బయటచేసే మోసాల కన్నా దైవత్వాన్ని మోసగించి స్వీకరించడం అనే పాతకం మరీ బలవత్తరమైనది

గనుక

భవిష్యత్తులో వారూ, వారి తర్వాత తరాలవారూ బాధాకరమైన జీవితాన్ని అనుభవించితీరుతారు.


తాత్కాలికంగా వారు  లబ్ది పొందినట్లు కనబడినా, భవిష్యత్తులో వారు నరక సమీపమైన వేదనను అనుభవిస్తారనడంలో సందేహం లేదు.


అటువంటి వారిని చూసి అదే భక్తి అని, 

అదే ఆధ్యాత్మికత అని పొరబడవద్దు. 

పాపం ఉన్నచోట పరమాత్మ ఉండడు..


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025