కార్తీక దీపము ఎప్పుడు నీటిలో వదలాలి? పోలి పాడ్యమి ఎప్పుడు??
కార్తీక దీపము ఎప్పుడు
నీటిలో వదలాలి?
పోలి పాడ్యమి ఎప్పుడు?
🙏నవంబరు 30 ఉదయం 9-33నుండి డిశంబర్ 1తేదీ ఉదయం 11-00 గంటల వరకు అమావాశ్య ఉన్నది.
అంటే 30తేదీ రాత్రి అమావాస్య ఉన్నది
1తేదీ ఆదివారం రాత్రి
అమావాస్య లేదు కనుక
కార్తీక దీపాలు నవంబర్ 30తేదీ రాత్రి అందరూ కార్తీక
దీపాలు అరటి దుప్పులలో
ఉంచి నీటిలో దీపాలు వదలాలి.
లేదా 2తేదీ పోలిపాడ్యమి, పోలి (స్వర్గానికి వెళ్లిన రోజు) కనుక
2తేదీ సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారు జామున
అనగా 1తేదీ తెల్లవారు జామున
పొలిని తలుచుకుని కార్తీక
దీపాలు నీటిలో వదలాలి.
పోలి కూడా ఆనాడు కార్తీక అమావాస్య రోజు దీపారాధన కుందులు లేకపోవడం వల్ల
పెరటి లోని అరటి చెట్టు
నుండి తీసిన అరటి దుప్పులో
పిండితో దీపారాధన కుంది చేసి కవ్వమునకు ఉన్న వెన్నను
కరగ పెట్టి ఆనేతితో దీపారాధన చేసి అమావాశ్య రోజు
నీటిలో వదిలింది.
అందుకే కార్తీక అమావాశ్య రోజునదులు,కొనేరులు,సరస్సులుమొదలైన చోట నీటిలో దీపాలు వదలాలి.
అవకాశం లేకుంటే ఇంట్లొ వుండే ఇత్తడి డీసు అదిలేకుంటే
మట్టి పాత్రలో నీటిని నింపి
తులసి కోట వద్ద
దీపము వదిలి పెట్టవలెను.
ఈమధ్య కొంతమంది
అతితెలివి తేటలు కలిగిన
మేధావులు వంటగదిలోని షింక్ నిండా నీటిని నింపి
దీపాలు అందులో ఉంచుతున్నారు.
ఎంగిలి మంగళం అయిన షింకులోఈపని ఏమిటి?
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment