పంచాంగం ( 28-11-2024 ) - Today Panchangam


 

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🥀పంచాంగం🥀

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 28 - 11 - 2024,

వారం ...  బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం,

శరదృతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,


తిథి      :  త్రయోదశి పూర్తి,

నక్షత్రం  :  చిత్ర ఉ7.50 వరకు,

యోగం :  సౌభాగ్యం సా4.56 వరకు,

కరణం  :  గరజి సా6.45 వరకు,


వర్జ్యం                :  మ2.01 - 3.47,

దుర్ముహూర్తము :  ఉ9.57 - 10.41,

                              మరల మ2.22 - 3.07,

అమృతకాలం     :  రా12.37 - 2.23,

రాహుకాలం        :  మ1.30 - 3.00,

యమగండం       :  ఉ6.00 - 7.30,

సూర్యరాశి          :  వృశ్చికం,

చంద్రరాశి            :  తుల,

సూర్యోదయం     :  6.16,

సూర్యాస్తమయం:  5.20,


              నేటి మాట


దయనే దైవం - అది ఎలా???

ఈ విషయం మనకు అర్థం, కావాలంటే, ఒకసారి జరిగిన  ఒక సంఘటన ద్వారా పరిశీలిద్దాము!!...


మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన సంత్ ఏకనాథ్ కథ, ఒక "సారి ఏకనాథ్ తన స్నేహితులతో కలిసి హరిద్వార్ వెళ్ళారు...


అక్కడ నుంచి కావిళ్ళలో గంగ నీరు నింపుకొని, రామేశ్వరంలో శివుని అభిషేకం చెయ్యడానికి తీసుకెళుతున్నారు...

   దారిలో ఒక గ్రామంలో అనావృష్టి కారణంగా త్రాగడానికి నీరు కూడా లేక ప్రజలు చాలా బాధపడుతున్నారు. 

     ఇంక పశుపక్ష్యాదుల సంగతి చెప్పనక్కరలేదు, అక్కడ నీరు దొరకక పశువులు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయి..


ఒక గాడిద దాహంతో, ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏకనాథ్ దృష్టిలో పడింది. 


అది చూసిన ఏకనాథ్ తన దగ్గర ఉన్న నీటి ని  లేచి ఆ గాడిద దగ్గర పెట్టారు...

నెమ్మదిగా కుండలోని నీరంతా త్రాగేసింది, అప్పుడు అది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది...


ఏకనాధ్ కి చాలా సంతోషం కలిగింది, అతని స్నేహితులు నీ కుండలో నీరంతా ఆ గాడిదకు ఇచ్చేశావు, నువ్వు రామేశ్వరం వెళ్ళి శివుని అభిషేకం ఎలా చేస్తావు?" అడిగారు. 

ఏకనాథ్ చాలా అమాయకంగా, "ఏం మీరంతా మీ దగ్గర ఉన్న గంగ ఇవ్వరా?” అని అడిగారు...


"మేము  హరిద్వార్ నుంచి స్వయంగా తెచ్చిన నీటితో అభిషేకం చెయ్యడమే విశేషం" అని మిత్రులు అన్నారు, ఏకనాథ్ నిస్సహాయంగా “ఏం చెయ్యను! నేను కూడా మీతోనే నడుస్తున్నాను... 

దాహంతో బాధ పడుతున్న గాడిదను చూసినప్పుడు నాకు ఆ రామేశ్వరంలో ఉన్న శివుడే కనిపించి, 'నేను ఇక్కడ దాహంతో ప్రాణం పోయే స్థితిలో ఉంటే మీరు నా అభిషేకానికి నీరు తీసుకొని రామేశ్వరం వెళుతున్నారా!? అని అడిగినట్టనిపించింది, అందుకని నేను గాడిదకు నీళ్ళు త్రాగించాను" అన్నాడు.


స్వామి వివేకానంద “ఎవరైతే పేదవాడిలో, బలహీనుడిలో, రోగిలో శివుణ్ణి చూడగలుగుతారో వారే నిజంగా శివుణ్ణి ఆరాధించినట్లు, విగ్రహంలో మాత్రమే శివుణ్ణి దర్శించేవారి ఆరాధన ఇంకా ప్రాథమికావస్థలో ఉన్నట్లే" అని దైవారాధనకు వినూత్న నిర్వచనాన్నిచ్చారు.


              🥀శుభమస్తు🥀

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025