పంచాంగం ( 27-11-2024 ) - Today Panchangam



 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ     ... 27 - 11 - 2024,

వారం  ...  సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం,

శరదృతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,


తిథి      :  ద్వాదశి తె5.41 వరకు,

నక్షత్రం  :  చిత్ర పూర్తి,

యోగం :  ఆయుష్మాన్ సా4.25 వరకు,

కరణం  :  కౌలువ సా4.36 వరకు

               తదుపరి తైతుల తె5.41 వరకు,


వర్జ్యం                 :  మ2.04 - 3.51,

దుర్ముహూర్తము  :  ఉ11.25 - 12.09,

అమృతకాలం     :  రా12.43 - 2.29,

రాహుకాలం        :  మ12.00 - 1.30,

యమగండం       :  ఉ7.30 - 9.00,

సూర్యరాశి          :  వృశ్చికం,

చంద్రరాశి            :  కన్య,

సూర్యోదయం     :  6.15,

సూర్యాస్తమయం:  5.20,


               నేటి మాట


“దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః" వేదం చెబుతోంది, మరి దీనికి మన జీవితానికి ఏంటి సంబందం???


దేహియే దేవదేవుడు, అట్టి దైవస్వరూపమైన దేహికి దేహమే ఆలయం. 

ఒక వైద్యుణ్ని చూడగానే మన రోగాలు, ఒక లాయర్ ని చూడగానే మన కేసులు జ్ఞాపకమొస్తాయి...


దేవాలయాన్ని చూడగానే దైవం జ్ఞాపకమొస్తాడు...

దైవం జ్ఞాపకం రాగానే మనలోని దుర్భావములు అదృశ్యమై, సద్భావములు ఉద్భవిస్తాయి...


అందుకే మన ప్రాచీనులు ప్రతి గ్రామములోనూ ఎత్తయిన గోపురాలతో దేవాలయాలు నిర్మించారు. 

దేవుడు మనకి కనబడి దేవాలయాన్ని చూపడు, దేవాలయమే మనల్ని ఆకర్షించి దైవాన్ని చూపుతుంది. 


ప్రతి దేవాలయం సర్వశక్తి సమన్వితుడైన దైవాన్ని సందర్శింపజేసే పవిత్ర పుణ్యక్షేత్రం. అందువలన ఏ వ్యక్తిని చూసినా అతని దేహంలో దేహియనే దైవం ఉన్నాడన్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ప్రతి వ్యక్తిని ప్రేమించి సేవించాలి. అ

ప్పుడే దేవుణ్ణి ప్రేమించి సేవించినట్లువుతుంది...🙏


              🌺శుభమస్తు🌺

 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025