ఈరోజు పంచాంగం ( 1-12-2024 ) - నేటి విశేషం
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 01 - 12 - 2024,
వారం ... భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : అమావాస్య ఉ11.01 వరకు,
నక్షత్రం : అనూరాధ మ2.26 వరకు,
యోగం : సుకర్మ సా5.20 వరకు,
కరణం : నాగవం ఉ11.01 వరకు,
తదుపరి కింస్తుఘ్నం రా11.29 వరకు,
వర్జ్యం : రా8.21 - 10.03,
దుర్ముహూర్తము : మ3.51 - 4.35,
అమృతకాలం : లేదు,
రాహుకాలం : సా4.30 - 6.00,
యమగండం : మ12.00 - 1.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.17,
సూర్యాస్తమయం: 5.20,
నేటి విశేషం
కార్తిక అమావాస్య
కార్తిక అమావాస్య నాడు పంచ పల్లవాలతో(రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి.
దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అంటారు, అశ్వయుజ మరియు కార్తిక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకాశం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి, స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి, దారిద్య్రాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయవలెను.
స్వాతిస్థితే రవా విందు: యది స్వాతి గతో భవేత్
పంచత్వ గుదకస్నాయీ కృతాభ్యంగ విధిర:
నీరాజితో మహాలక్ష్మీమ్ అర్చయన్ శ్రియమశ్నుతే
అనగా సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా లేదా చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా పంచత్వక్ ఉదకములతో అభ్యంగన స్నానమాచ రించి లక్ష్మీనారాయణులకు నీరాజనమిచ్చినచో సంపదలు పొందుతారు.
ఆశ్వయుజ కార్తికములే కాక ప్రతీ అమావాస్య మరియు సంక్రమణం నాడు అభ్యంగన స్నానం ఆచరించి రోజంతా ఉపవసించి శక్తి మేర దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఈయవలెను.
ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.
హేమాద్రి పురాణానుసారం సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పడు ప్రదోష సమయమున దివిటీలతో, ఆకాశదీపాలతో పితృదేవతలకు దారి చూపవలెను.
అలాగే ఆశ్వయుజ, కార్తిక అమావాస్యల నాడు రాత్రి నిద్రించరాదు.
ఆరోజు అర్థరాత్రి లక్ష్మీదేవి పురవీధులలో ఆకాశమార్గమున సంచరిస్తూ ఉంటుంది కావున ఇంటి వాకిలిలో, ఇంట్లో ముగ్గులు, తోరణములు, దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ స్తోత్రములు, పూజలు చేయవలెను.
ఈవిధంగా చేయని వారింటికి లక్ష్మీదేవి చేరదని పురాణ వచనం, అమావాస్య అపర రాత్రి దాటిన పిదప అనగా బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిపత్ స్పర్శతో జనులు డప్పులతో అలక్ష్మి(దారిద్య్రం)ని తరిమివేయాలి.
🍁శుభమస్తు🍁
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment