శ్రీమద్రామాయణము

 


"యే మే కులే లుప్తపిండాః పుత్రదార వివర్జితాః|,

తేషాం హి దత్త మక్షయ్యమ్ ఇదమస్తు తిలోదకం""

నా వంశములో ఎవరైనా భార్యాపుత్రులు లేక పిండోదకములు లేక అవస్థ పడుచున్న మా పూర్వీకులకు నేను చేసే ఈ తిలోదకము వారికి పుణ్యలోక ప్రాప్తి ని కలుగచేయుగాక.ఇలా హితవు పలికి మనకి పితృకార్యముల పట్ల ఆసక్తి కలిగించిన ఋషుల ఋణము అనగా ఆ ఋషిఋణము మనమెప్పటికి తీర్చుకొనలేము గదా.

ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు?,జన్మనిచ్చి మనకి విద్యాబుద్ధులు నేర్పించి మన అభివృధ్దికి కారణమైన తల్లితండ్రులకు శ్రాధ్దకర్మలు చేయకుండా ఎగ్గొట్టడానికినేటి తరము అనేక కారణాలు వెతకి చెపుతున్నారు.గంటలతబడి చరవాణులలో సంభాషిస్తారు,టి.వి.లముందు గంటలతరబడి కాలక్షేపము చేస్తారు.కానీ ఒక గంటసేపు శ్రాద్ధకర్మలకి కేటాయించలేరు.ఇది జాతికి పట్టిన దురదృష్టము.ఈ శ్రాద్ధకర్మలు నిర్వహించకలేకపోతే ఎలా అనే విషయాలు తెలుసుకుందాము.

నిజమే వృద్ధాప్యం వల్లనో మరే ఇతర కారణాలవల్లనో ఈ శ్రాద్ధకర్మలు చేయలేకపోతే 

"" తృణాని వా గవేదద్యాత్ పిండాన్యాపి వినిర్వపేత్|,

తిలోదకైః పిత్రూన్వాపి తర్పయేత్ స్థాన పూర్వకమ్|,

అగ్నినా దహేత్కక్షం శ్రద్ధాకాలే సమాగతే|,

తస్మింశ్చో పవసేదహ్ని జపేద్వా శ్రాద్ధ సంహితా|,

పిండమాత్రం ప్రదాతవ్యమభాలే ద్రవ్యవిప్రయోః|,

శ్రాద్ధాహనితు సంప్రాప్తే భవేన్నిరశనోపివా||,

అయ్యా నీవు శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే ,ఆవుకు పచ్చగడ్డి వేయవచ్చు,పిండాలు చేసి పితరులను స్మరిస్తు గోవుకు పెట్టిగానీ నదీజలాలలో కలిపి గానీ,లేదా అగ్నిలోగాని హుతము చేయవచ్చు.లేదా నల్లనువ్వులతో తర్పణాలు వదలవచ్చు.ఇవేమి నాకు చేతకాదండి అంటే చివరకు అట్లకాడ కాల్చి శరీరము ఎడమ ప్రక్కన వాత పెట్డుకొని రోదించాలి.ఇక దీనివల్ల  శ్రాద్ధకర్మల విశిష్టత అర్థము చేసుకోవచ్చు.

వనవాసములో యున్న రామునికి భరతాదుల వల్ల తండ్రిమరణ వార్త తెలుస్తుంది.కొంతసేపు విలపించి

"" ఏతత్ తే రాజశార్ధూల విమలం తోయమక్షయమ్ |,

పితృలోకగతస్యాద్య  మద్దత్తముపతిష్టతు||,(అయో.కాం.102-27),

ఓ తండ్రీ నేను సమర్పించు ఈ జలములు పరలోక గతులైన మీకు చెందుగాక యని తర్పణాలు వదిలి తర్వాత రేగుపండ్లతో గారపిండిని కలిపి పిండాలు చేసి 

"" ఇదం భుంక్ష్వ మహారాజ ప్రీతో యదశనో వయమ్|,

యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః||,(102-30),

ఓ తండ్రీ ఈ అడవిలో మేము రోజు తినే ఆహారమునే మీకు పిండరూపములో సమర్పిస్తున్నాను.ఆరగింపుడని పిండప్రదానము చేస్తాడు.

రాముని కష్టాలకన్నా మన కష్డాలు ఎక్కువగ కనబడినప్పుడు పైన చెప్పిన ఇతర పనులతో శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చు.

సాగరమథన సమయములో శ్రీమన్నారాయణుడు స్వయముగ శ్రాద్ధ తిధులయందు పితృదేవతలకు అపూర్వమైన శక్తులిచ్చి గౌరవించాడు.కనుక వారిని సంతృప్తి పర్చి వారినుండి ఆశీర్వచనములు పొంది సుఖసౌఖ్యాలు పొందాలని రామాయణములో రాముడు చేసిన శ్రాద్ధ కర్మలద్వార రామాయణము శ్రాద్ధకర్మల ఔచిత్యాన్ని ఎల్లరకు తెలియచేస్తున్నది.

అన్ని విషయాలు రామాయణముమనకి తెలియపర్చింది  అందుకనే అది నిత్య పారాయణ గ్రంధముగ గుర్తెరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు 
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు