నేటి పంచాంగము
🕉️🙏ఓం నమో వెంకటేశాయ🕉️🙏
తేది : జూన్ 01 - 06 - 2024 శనివారం
శ్రీ క్రోధినామ సంవత్సరము-ఉత్తరాయణం-వసంతఋతువు-వైశాఖమాసం
బ. నవమి : ఉ॥ 7:24 వరకు
బ. దశమి : తె॥ 5:04 వరకు
ఉత్తరాభాద్ర : రా|| 3:15 వరకు
ప్రీతియోగం : మ॥ 3:08 వరకు
గరజికరణం : ఉ॥ 7:24 వరకు
వణిజకరణం : సా॥ 6:14 వరకు
భద్రకరణం : తె॥ 5:04 వరకు
అమృతం :10:45 - 12:15 వరకు
దుర్ము : ఉ॥ 5:45 - 7:29 వరకు
వర్జ్యం మ 1:46 - 3:16 వరకు
ఈరోజు
1. ఉద్యోగంలో చేరడానికి, వైద్య సంప్రదింపులకు, మొండికి పడిన ఇంటి పనులకు, మొక్కలు నాటుకొనడానికి, వాహన మరమత్తులకు, క్రయవిక్రయాలకు, అద్దె ఇల్లు మారడానికి, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్లకు, ప్రయాణాలకు, వ్యాపార చర్చలకు అనుకూలం. నేడు అప్పు కూడదు.
2. హనుమత్ జయంతి: పరాశర సంహిత వంటి ప్రాచిన గ్రంధములను అనుసరించి శ్రీరామపాద సేవా దురంధరుడు అయిన ఆంజనేయ స్వామి వారు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్న వేళ అవతరించారు. (నేటి రోజు) హనుమద్ అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ రోజు అంతా ఉపవసించి మధ్యాహ్నం వేళ ఆంజనేయ స్వామి వారిని యధా శక్తిగా పూజించాలి. హనుమత్ ప్రీతిగా దానములను ఆచరించాలి. పూజలో సింధురమునకు, తమలపాకులకు, తెల్ల జిల్లేడు పూలకు విశేష ప్రాముఖ్యత ఉంది. అలాగే నివేదనలో అప్పాలు ముఖ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఐదు సంఖ్య స్వామికి ప్రీతి కనుక అన్ని ఐదు సంఖ్యగా ఉండేటట్టుగా ఆచరించడం మంచిది.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
.jpg)
Comments
Post a Comment