సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు

నేను లేకపోతే? అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు. '"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని. అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. **మరింత ముందుకు వెళితే త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా...