"వానలు" ఇన్నివిధాలుగా వుoటాయని తెలుసా...?

 


"వానలు" ఇన్నివిధాలుగా వుoటాయని తెలుసా...?

 వానలు పలురకాలు: 

1. గాంధారివాన: 

కంటికి ఎదురుగా ఉన్నది

కనిపించనంత జోరుగా 

కురిసే వాన..

2. మాపుసారివాన:

సాయంత్రం కురిసే వాన..

3. మీసరవాన:

మృగశిరకార్తెలో కురిసే వాన..

4. దుబ్బురువాన:

తుప్పర/తుంపర వాన..

5. సానిపివాన:

అలుకు (కళ్లాపి) జల్లినంత

కురిసే వాన..

6. సూరునీల్లవాన: 

ఇంటి చూరు నుండి ధార

పడేంత వాన..

7. బట్టదడుపువాన: 

ఒంటి మీదున్న బట్టలు

తడిపేంత వాన..

8.తెప్పెవాన: 

ఒక చిన్న మేఘం నుంచి

పడే వాన..

9.సాలువాన: 

ఒక నాగలిసాలుకు 

సరిపడా వాన..

10. ఇరువాలువాన:

రెండు సాల్లకు & విత్తనాలకు

సరిపడా వాన..

11.మడికట్టువాన: 

బురదపొలం దున్నేటంత 

వాన..

12.ముంతపోతవాన:

ముoతతోటి పోసినంత 

వాన..

13. కుండపోతవాన:

కుండతో కుమ్మరించినంత వాన..

14. ముసురువాన:

విడువకుండా కురిసే వాన..

15.దరోదరివాన:

ఎడతెగకుండా కురిసే వాన..

16. బొయ్యబొయ్యగొట్టేవాన:

హోరుగాలితో కూడిన వాన..

17.రాళ్లవాన: 

వడగండ్ల వాన..

18.కప్పదాటువాన:

అక్కడక్కడా కొంచెం 

కురిసే వాన..

19.తప్పడతప్పడవాన:

టపటపా కొంచెంసేపు 

కురిసే వాన..

20.దొంగవాన: 

రాత్రంతా కురిసి తెల్లారి

కనిపించని వాన..

21.కోపులునిండేవాన:

రోడ్డు పక్కన గుంతలు

నిండెంత వాన..

22.ఏక్దారవాన: 

ఏకధారగా కురిసే వాన..

23.మొదటివాన:

విత్తనాలకు బలమిచ్చే వాన..

24.సాలేటివాన: 

భూమి తడిసేంత భారీ వాన..

(వానలపేర్లు ఇన్నుంటాయని ఎవరికి తెలియదు...)

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special