రాశిఫలాలు - జూన్ 05 , 2025

05-06-2025 గురువారం రాశి ఫలితాలు మేషం నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. వృషభం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి. మిధునం కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటకం ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమ...