శ్రీ విశ్వా వసు నామ ఉగాది ఆచరణ రేపటి రోజు

 


శ్రీ విశ్వా వసు నామ ఉగాది ఆచరణ  రేపటి రోజు

 1. తైలాభ్యంగన స్నానం 

ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వుల నూనెతో మర్దన చేసుకొని  బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయాత్ పూర్వం కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని 

3 సార్లయినా ఉచ్చరించాలి. 

2. నూతన వస్త్ర ధారణ 

స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టు కోవాలి. కుదరకపోతే ఉతికిన సాంప్రదాయ  వస్త్రాలు ధరించాలి. ఆడా మగ ఎవరైనా సరే  షార్టులు - చడ్డీలు ధరించి దేవుడి ముందు కూర్చోవద్దు.  

3. దేవతార్చన :

నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి బ్రహ్మ దేవుడి ప్రార్థన సంవత్సరాది స్తోత్రం ప్రార్ధన చేయాలి. 

! బ్రహ్మ స్తుతి ! 

ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే !

నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !!

నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!!  

సంవత్సరాది స్తోత్రం 

అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహం !

అజారూడం చతుర్హస్తం ద్వి శీర్షం ప్లవ సంజ్ఞకం !! 

4. పంచాంగం పూజ 

శ్రీ విశ్వా వసు

 నామ సం.ర పంచా౦గాన్ని పూజించాలి. 

5.  నింబ కుసుమ భక్షణం 

పూజా మందిరంలో ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి కింది శ్లోకం చదువుకుంటూ ప్రాసన చేయాలి. 

ఉగాది పూజా విధానం పైన ధర్మ సూక్ష్మ సహితమైన చాగంటి వారి ప్రవచనం 

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ |

సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం | | 

6. దానం

పితృ దేవతల ఆశీస్సుల కోసం ఉగాది రోజున చల్లని నీటి పాత్రను దానం చేయాలి. అలాగే తెల్లని వస్త్రాలు, గొడుగు, విసనకర్ర, చెప్పులు కూడా అవకాశం ఉన్నవారు ఇవ్వవచ్చు

 7. పంచాంగ శ్రవణం 

సాయంత్రం ఇంటిల్లిపాది అందరూ కలిసి దగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం చేసి తమ రాశి ఫలాలను తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయించిన పండితులవారి ఆశీసులు తీసుకోవాలి. 

ఓం నమఃశివాయ 

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #ugadi #ugadiacharana #astrovidhaataa #Astrology #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము