తిరువనంతపురం అట్టుకల్ పొంగలా ఉత్సవం :
తిరువనంతపురం అట్టుకల్ పొంగలా ఉత్సవం :
అట్టుకల్ పొంగలా ఉత్సవ సమయంలో తిరువనంతపురంలోని ప్రతీ రహదారి.. ప్రతీ వీధి ఇటుకల పొయ్యిలతో నిండిపోతాయి. కేరళ నుంచే గాక.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మహిళలు... భగవతీ
అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరతారు. ఉత్సవం జరిగే రోజున.. తిరువనంతపురంలోని ప్రధాన రహదారులపై సైతం.. పొంగళ్లు పండేందుకు మహిళలు పొయ్యిలు ఏర్పాటుచేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. చారిత్రక గాధ ప్రకారం.. తిరువనంతపురంలో వెలసిన అట్టుకల్ భగవతీ అమ్మవారిని సాక్షాత్తూ పార్వతీదేవి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. కేరళలోని ప్రసిద్ధమైన దేవీ క్షేత్రాల్లో అట్టుకల్ అమ్మవారి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్వతీదేవి ఓ బాలిక రూపంలో ఈ క్షేత్రంలో వెలసిందని.. భక్తులు నివేదించిన పాయసాన్ని నైవేద్యంగా స్వీకరించిందని ప్రతీతి. అందుకు గుర్తుగా ప్రతీ ఏటా ఈ క్షేత్రంలో అట్టుకల్ పొంగలా ఉత్సవం నిర్వహిస్తారు.
అట్టుకల్ భగవతీ పొంగలా ఉత్సవం పదిరోజులపాటు జరుగుతుంది. మొదటి ఎనిమిది రోజులు ఆలయంలో విశేష ఉత్సవాలు జరిగిన అనంతరం.. తొమ్మిదో రోజున పొంగలా ఉత్సవం నిర్వహిస్తారు. సూర్యోదయానికంతా పొయ్యిలు సిద్ధం చేసుకుని మహిళలు బారులు తీరతారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సైతం దేవస్థానం తరఫున ఒక పొయ్యిని సిద్ధం చేస్తారు. ప్రధానార్చకులు గర్భాలయంలోని అఖండ జ్యోతి నుంచి అగ్నిని స్వీకరించి.. మొదటి పొయ్యిని వెలిగిస్తారు. ఆ అగ్నితోని మిగతా అన్ని పొయ్యిలను వెలిగిస్తారు తప్పించి.. వేరే నిప్పును వాడరు. అమ్మవారికి పొంగలి నివేదించేందుకే ప్రధానంగా మట్టికుండలనే వాడతారు. బియ్యం, పాలు, బెల్లం, అరటిపళ్లు ఉపయోగించి పొంగలిని తయారుచేస్తారు. ఉత్సవం రోజున ఉదయం పదిగంటలకు ఆలయం నుంచి ప్రధానార్చకులు తీసుకువచ్చిన అగ్నితోనే భక్తులందరూ తమ పొయ్యిని వెలిగించుకుంటారు. మధ్యాహ్నం పొంగలిని సంప్రోక్షణ చేసి... ఎక్కడివారు అక్కడి నుంచే అమ్మవారికి పొంగలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ నివేదన పూర్తయ్యేదాకా... మహిళలందరూ ఉపవాసంతో ఉంటారు. పాయస నివేదనం పూర్తయిన తర్వాత.... రాత్రివేళ అమ్మవారిని ఘనంగా ఊరేగిస్తారు. మరుసటి రోజున అమ్మవారి ఉత్సవమూర్తి ఆలయ పునఃప్రవేశంతో అట్టుకల్ పొంగలా ఉత్సవం ముగుస్తుంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Jai amman
ReplyDelete