రామాయణం 380


రామాయణం 380

హనుమంతుడు అకంపనుని

అంగదుడు వజ్రదంష్ట్రుని

వానర సేనానినీలుడు రాక్షససేనాని పహస్తుని

యమలోకమునకు సాగనంపిరి.

యుద్ధరంగమంతా భీతావహంగా ఉంది. ఎటువైపు చూసినా భీభత్సమే !

రక్తప్రవాహముతో నిండిన భూమి వైశాఖ మాసములో ఎర్రటి మోదుగలు పరచిన పుడమి లా ఉన్నది

చనిపోయినవారి కొవ్వుఅనే నురగతో నిండిపోయిన ఎర్రెర్రటి నది అది.

 ఆ రణభూమిలో పిరికి వారెవరికీ ప్రవేశములేదు!

ప్రహస్తుడు మరణించినాడా ? నమ్మలేకపోయినాడు రావణుడు ....అవును మరణించినాడు ఇది నిజం !ముమ్మాటికీ నిజం మహారాజా అని సైనికులు తెలుపగా ఇక తానే స్వయముగా రణరంగమునకు బయలుదేరినాడు రావణుడు.

నల్లని మేఘమువలే ,

ప్రజ్వరిల్లిన అగ్ని శిఖవలె ప్రమథగణసేవితుడైన రుద్రునివలె ,

రావణుడు గొప్పతేజస్సుతో ప్రకాశించుచూ రాక్షస గణములు వెంట అనుసరించగా రణస్థలికి తానే ఉరికినాడు.

ఎదురుగా కడలివలే కదలుతూ ఉప్పొంగే సేనావాహినిని చూస్తూ రామచంద్రుడు విభీషణుని తో ఆ సైన్యము ఎవరిది? అని ప్రశ్నించెను.

రామచంద్రా !

అదుగో !!!!

ఏనుగెక్కి ఉదయసూర్యునివలె ఎర్రని ముఖముగల ఆ యోధుడు "ప్రవీరబాహువు"

అదిగో ఆ రధముమీద రెపరెప లాడే సింహధ్వజము !

ఆ రధము  ఎక్కి వచ్చే రణకర్కశుడు ఇంద్రజిత్తు

అదుగో ఒక మహాపర్వతము కదలినట్లుగా కదులుతున్నాడే వాడే అతికాయుడు.

ఎర్రనైన కన్నులతో ఏనుగునెక్కి గంటలు వాయించుకుంటూ వస్తున్నాడే ! వాడు మహోదరుడు

చిత్రాతిచిత్రమైన అలంకరణలతో ఉన్న ఆ గుర్రము చూడు ! దానినెక్కి వచ్చే దానవుడు "పిశాచుడు".

వాడిగల శూలమును ఒడుపుగా పట్టుకొని ఆటవిడుపుగా తిప్పుతూ వస్తున్నాడే ! వాడే "త్రిశిరస్కుడు".

అడుగో ఆ సర్ప రాజ చిహ్నము గలవాడు కుంభుడు,అడుగో వీరకృత్యములు చేయు నికుంభుడు ! వాని చేతిలో వజ్రాలుపొదగబడిన పరిఘ ఉన్నది.,

అనుచూ రావణుని పరివేష్టించి ఉన్న రాక్షసవీరులగురించి చెపుతున్నాడు విభీషణుడు.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #ramayanam #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Post a Comment

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025