రాశిఫలాలు - ఫిబ్రవరి 13- 2025
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేయడం వల్ల, మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని పనులను వాయిదా వేయొచ్చు. దీంతో మీ మనస్సులో గందరగోళం ఏర్పడుతుంది. కానీ ఇప్పటికీ మీరు ఆ పనులను తరువాత వరకు వాయిదా వేస్తారు. మీ డబ్బు వ్యాపారంలో ఎక్కడో చిక్కుకుపోయి ఉంటే, ఈరోజు మీరు దాన్ని పొందొచ్చు. ఈరోజు మీ కుటుంబంలో ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా తిట్టకూడదు. మీరు ఇలా చేస్తే, తరువాత పశ్చాత్తాపపడాల్సి రావొచ్చు.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని బాధ్యతలు పెరగొచ్చు. దీంతో మీ మనస్సు కొద్దిగా కలవరపడుతుంది. అయినప్పటికీ మీ బాధ్యతలను సులభంగా నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈరోజు కొన్ని కొత్త పనులు అప్పగించబడొచ్చు. కానీ ఉన్నతాధికారుల సలహాతో, మీరు ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి వారు ఈరోజు స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఈరోజు మీ పనులకు ఇతరులకు అప్పగించకూడదు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి కొన్ని చేదు విషయాలు చెబుతారు. ఈ కారణంగా వారు మీపై కోపంగా ఉండొచ్చు. అలా అయితే, వారికి దానిని వివరించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈరోజు సాయంత్రం, మీ కుటుంబసభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరుకావొచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఏ విషయంపైనైనా ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే అది మీకు పెద్ద సమస్యను సృష్టించొచ్చు. మీ మధురమైన మాటల కారణంగా పని ప్రదేశం నుండి ఇంటి వరకు, మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే అది మీకు భారీ లాభాలను ఇస్తుంది. చిన్న వ్యాపారులు ఈరోజు నగదు కొరతను ఎదుర్కోవచ్చు.
సింహ రాశి
వారు ఈరోజు పనికి సంబంధించి ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కానీ ఈరోజు మీ తల్లి ఆరోగ్యం కొంచెం క్షీణించొచ్చు. ఇది జరిగితే, దయచేసి వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు, మీ ప్రత్యర్థులలో కొందరు మీకు హాని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలొస్తాయి.
కన్య రాశి
వారిలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు పాక్షిక లాభం పొందుతారు. అయినప్పటికీ వారు తమ కుటుంబ ఖర్చులను తీర్చలేరు. ఈరోజు మీకు కొంత మానసిక ఉద్రిక్తత ఉండొచ్చు. ఈ కారణంగా మీ మాటలు కఠినంగా మారొచ్చు.
తులా రాశి
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. అయితే ఏదైనా వాదనలు ఉంటే మీరు మౌనంగా ఉండటం మంచిది. మీ తండ్రి మార్గదర్శకత్వంలో చేసే పనిలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు విద్యలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు వినిపిస్తాయి. మీకు కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కొందరు వ్యక్తులు కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. మరోవైపు మీ తల్లితో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. ఇది మీ కుటుంబ వాతావరణంలో అశాంతిని సృష్టించొచ్చు. కానీ మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుడి సహాయంతో మీరు సాయంత్రం నాటికి వాటిని పరిష్కరించగలుగుతారు. ఈరోజు మీరు వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకుంటే, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో గౌరవం పొందుతారు. ఈరోజు మీరు పనిలో మీ సహోద్యోగితో వాదనకు దిగకుండా ఉండాలి. లేదంటే మీరు చేసే పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీ పనిని పూర్తి చేయడానికి తొందరపడతారు. దీని వలన మీకు కొంత నష్టం జరగొచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందడంతో సంతోషంగా ఉంటారు.
మకర రాశి
మకర రాశి వారు ఈరోజు తల్లిదండ్రులను సంతోషపెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారంలో ఇతరులకన్నా మంచి లాభాలను పొందుతారు. ఒక ఉద్యోగి మరేదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, వారు ఈరోజే దానిని ప్రారంభించవచ్చు. ఈ సాయంత్రం, మీ కుటుంబంతో కలిసి దేవుడిని దర్శించుకోవడానికి ఒక యాత్రకు వెళ్ళొచ్చు
కుంభ రాశి
వారు ఈరోజు కొత్త పనుల కారణంగా తమ దినచర్యలో మార్పులు చేసుకోల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కానీ ఇది చూసి, మీ శత్రువులు కొందరు మీ పనిని పాడుచేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించొచ్చు. మీ బిజీ షెడ్యూల్ మధ్య, మీ ప్రేమ జీవితానికి కూడా సమయం కేటాయించగలుగుతారు. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.ఈ సాయంత్రం మీ ప్రయాణంలో మీకు కొంత ముఖ్యమైన సమాచారం లభించొచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. వీటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు మీ పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీరు శారీరక నొప్పిని అనుభవించొచ్చు.
- సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#rasiphalalu #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Chala baguntunnayi mee post lu
ReplyDelete