శత్రువులు మిత్రులుగా మారుటకు
మీకు గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవతో తలనొప్పి తెస్తోందా .అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఇంట్లో, బయట ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్నచోట మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు తొదరలోనే (కొంతసమయం) మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఆ పరిహారం విధి ప్రతిరోజూ ఉదయాన్నే 4.30గం!!ల నుండి 5.30గం!!ల లోపల స్నానం చేసి కాలభైరవుడి ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి “ ఓం కాలభైరవాయ నమః “ అనేటటువంటి మంత్రంతో 101 సార్లు జపించి అక్షితలుతో పూజ చేసిన తరువాత కొద్దిగా అన్నం వండి చల్లారిన పిదప ఆ అన్నాన్ని తీసుకుని ఆ అన్నంలో తెల్లనువ్వులు వేసి కాలభైరవుడికి నైవేద్యం పెట్టిన పిదప ఆ అన్నాన్ని పక్షులకు వేయండి.అలా వేయడం వలన మీకు ఎక్కడైనా సరే మీరు వెళ్లినటువంటిచోట గొడవలులేక కోర్టువ్యవహారాలు చికాకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల కాలభైరవుడు శత్రువులను నాశనం చేయరు శత్రువులను మిత్రులుగా చేస్తారు.. కాలభైరవారాధనతో పాటుగా మీ కులదేవత ఆరాధన కూడాచేయడం మంచిది. ఈ క్రియతో మీకు వాక్శుద్ధి కలుగుతుంది. మీరు చెప్పేటటువంటి మాట ఎవరైనా సరే చేతులు కట్టుకుని వినే అవకాశం స్వామి వారు కల్పించుతారు. క్రమం తప్పకుండా జాగ్రత్తగా పాటిస్తే కనుక తప్పనిసరిగా మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోయేటటువంటి అవకాశం మీకు లభిస్తుంది.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
#astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology #havaneja #jathakam
nice
ReplyDelete