మార్గశిర లక్ష్మి పూజ
మార్గశిర లక్ష్మి పూజ.........!!
మార్గశిరములో ఎవరయితే లక్ష్మిదేవి ని లక్ష్మివారము
[గురువారం] అర్చించుతారో వారికి సిరిసంపదలు తప్పక కలుగుతాయి అని పూర్వ గ్రందములలోచెప్పబదినడినది
మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారము[గురువారము]లు మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవి. భక్తుల ఇళ్లలో సకలసంపదలు కలుగుటకు సులభ మార్గము.
మార్గశిరములో గురువారము లక్ష్మి పూజ అమ్మకు అత్యంత ప్రితిదాయకం అందువల్ల ప్రతి గురువారము అమ్మవారికి గోక్షిరాభిషేకము మరియు సహస్ర కుంకుమాభిషేకము నీరాజన మంత్ర పుష్పముల తో పూజలు జరుపవలెను. కావున లక్ష్మి సిద్ధికై మీరు పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వగలరు.
లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.
కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.
గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పకమంచిఫలితాలనిస్తుంది
మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.
రాశి – పేరులో మొదటి అక్షరం మంత్రం మేషం
చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ-ఓం ఏం క్లీం సౌ:
వృషభం –
ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో- ఓం ఏం క్లీం శ్రీః
మిథునం-
కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా -ఓం క్లీం ఏం సౌ:
కర్కాటకం-
హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో -ఓం ఏం క్లీం శ్రీః
సింహం-
మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె- ఓం హ్రీం ఏం సౌ:
కన్య-
టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో- ఓం శ్రీం ఏం సౌ:
తుల-
రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె- ఓం హ్రీం క్లీం శ్రీం:
వృశ్చికం-
తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ- ఓం ఏం క్లీం సౌ:
ధనుస్సు-
యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె – ఓం హ్రీం క్లీం సౌ:
మకరం-
భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ- ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సౌ:
కుంభం-
గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా- ఓం హ్రీం ఏం క్లీం శ్రీం
మీనం-
దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ- ఓం హ్రీం క్లీం సౌ:
ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు.
అందుచేత ఈ మంత్రాలను గురుముఖముగా తెలుసుకొని అభ్యసించిన మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment