విదేశాలకు వెళ్లే యోగం ఉందా లేదా అనేది జాతక చక్రం పరిశీలనలో కచ్చితంగా తెలుసుకోవచ్చా.??
విదేశీ యోగం
చాలామంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి వ్యాపారాలు చేయాలి అనుకుంటూ ఉంటారు. విదేశాలకు వెళ్లే యోగం ఉందా లేదా అనేది జాతక చక్రం పరిశీలనలో కచ్చితంగా తెలుసుకోవచ్చు. కొందరు విదేశాలు వెళ్లడం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కొందరు అప్పులు కూడా చేస్తారు.ఆస్తులు ఖర్చయిపోయి అప్పులు పెరిగిపోతాయి అయినప్పటికీ విదేశీయాలకు వెళ్ళకుండా ఉండిపోతారు. కొందరు వీసా కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ వీసా తొందరగా లభించదు. అసలు వారి జాతకంలో విదేశీ ప్రయాణ యోగం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మరియు ఏ సమయంలో విదేశాలకు వెళ్లగలరు అనే విషయం కూడా తెలుసుకుని ప్రయత్నిస్తే వారు సక్సెస్ అవుతారు.విదేశాలకి వెళ్లబోయే జాతకులకు జాతక చక్రంలో ఏ విధంగా పరిశీలించాలి అనేది చాలా కోణాలలో విస్తృతంగా ఉంటుంది. ఈరోజు ఒక భాగం గురించి తెలుసుకుందాం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే సముద్రం దాటి వెళ్ళాలి అది విమానంలో కావచ్చు షిప్ లో కావచ్చు. సముద్రం దాటాలి అంటే జాతకంలో ఎనిమిదో స్థానాన్ని పరిశీలించాలి. ఏ లగ్నం అయినప్పటికీ జాతకంలో ఎనిమిదో స్థానంలో పాపగ్రహాలైన కుజుడు శని భగవానుడు రాహువు ముగ్గురు కానీ లేదా ఇద్దరు కానీ లేదా ఒక్కరు ఉన్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్లే జాతకం అని చెప్పవచ్చు. ఏ సమయంలో విదేశాలకు వెళతారు అనేది పరిశీలిస్తే ఎనిమిదో స్థానంలో ఉన్న గ్రహాల అంతర్దశలో కానీ ఎనిమిదో స్థానంలో ఉన్న గ్రహాలు ఏ ఏ గ్రహాలపై దృష్టి సారిస్తున్నాయో ఆగ్రహాల అంతర్దశలో గాని జాతకులు విదేశీ ప్రయాణం చేస్తారు. ఇది చాలా జాతకాలు పరిశీలించి నిర్ధారణకు రావడం జరిగింది. విదేశాలలో ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారా, విదేశాలలో వివాహం ద్వారా స్థిరపడతారా, విదేశాలలో సంపాదించిన ధనం తాను అనుభవిస్తాడా లేదా మరొకరు అనుభవిస్తారా ఈ విధంగా జాతకంలో అనేక అంశాలు పరిశీలన చేయవచ్చు. విదేశాలలో స్థిర నివాసం ఉంటుందా లేదా అనేది మరొకసారి తెలుసుకుందాం.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
Manchi samacharam
ReplyDelete