నేడు శ్రీ రాధాకుండ ఆవిర్భావం - Today Special
నేడు శ్రీ రాధాకుండ ఆవిర్భావం
అరిష్టాసుర సంహారము తరువాతనే రాధాకుండము, శ్యామకుండము ఆవిర్భవించాయి. ఈ విషయాన్ని ఆచార్యులు మనకు తెలియజేసారు. శ్రీకృష్ణుడు అరిష్టాసుర సంహారము చేసిన తరువాత గోపికలు అతనితో పలుకుతూ “కృష్ణా! అరిష్టుడు అసురుడేయైనా వృషభరూపంలో ఉన్నాడు. కాబట్టి వృషభాన్ని వధించిన పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేసికోవాలి. కాబట్టి ముల్లోకాలలో ఉన్న తీర్థాలలో స్నానం చేయనిదే నీవెట్లా పవిత్రుడవు కాగలుగుతావు?” అని అన్నారు.
ముల్లోకాలలోని తీర్థాలకు వెళ్ళి స్నానం చేయవలసిన అవసరము తనకు లేదని, వాటినే తన దగ్గరకు రప్పిస్తానని శ్రీకృష్ణుడు పలికి తన కాలిమడమతో నేలను తాకగానే సమస్త తీర్థాలు ఆ దేవదేవుని ముందు ప్రకటమయ్యాయి. అవన్నీ కలిసి శ్యామకుండముగా తయారయ్యాయి. శ్రీకృష్ణుడు దానిలో స్నానం చేసి పవిత్రుడయ్యాడు. “సర్వతీర్థాలు కలిగిన కుండాన్ని నేను సృష్టించాను. మీరు మాత్రం బ్రహ్మదేవుని ప్రీత్యర్థము ఈ ధరణిపై ఎటువంటి ధర్మకార్యము చేయలేదు" అని పలుకుతూ అపుడు శ్రీకృష్ణుడు గోపికలను రెచ్చగొట్టగా రాధారాణికి కోపం వచ్చి శ్యామకుండము కన్నను సుందరమైన కుండాన్ని తాను సృష్టిస్తానని పలికి సఖీబృందముతో కలిసి చేతులతోనే ఒక కుండాన్ని త్రవ్వింది. తరువాత సకల తీర్థపురుషుడు వచ్చి రాధారాణికి నమస్కరించి ఆమె సేవాభాగ్యాన్ని తనకు
ప్రసాదించమని వేడుకున్నాడు. రాధారాణి ఆదేశం మేరకు తరువాత సమస్త తీర్థాలు రాధాకుండములో ప్రవేశించాయి. అపుడు శ్రీకృష్ణుడు పరమానందముతో పలుకుతూ "రాధా! నీ కుండము నా శ్యామకుండము కన్నను ఎక్కువ జగద్విఖ్యాతము అవుతుంది. నేను నీ కుండములో నిత్యము జలక్రీడ చేస్తాను. నీవు నాకెంతగా ప్రియమైనదానవో నీ కుండము కూడ నాకు అంతగానే ప్రియమైనది" అని అన్నాడు. ఆ విధంగా రాధాశ్యామకుండ ద్వయము ధరణిపై ఆవిర్భవించి జనులకు మంగళము కలుగజేసాయి.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
So nice
ReplyDelete