మూల నక్షత్ర సరస్వతీ పూజ || Saraswathi Pooja

 

మూల నక్షత్ర సరస్వతీ పూజ :


ఆ తల్లి నాలుగు భుజాలూ నాలుగు వేదాలు. ఆమె చేతిలో పుస్తకం అన్ని శాస్త్రాలకు సంకేతం. కమండలంలో నీరు సర్వశాస్త్రాల అమృతరసం. అక్షమాల కాలానికి సంకేతం. ఆమె ఒక పూస తిప్పితే ఒక కల్పం గడిచినట్టు అంటారు. ఆ సరస్వతీదేవిని వైష్ణవీ శక్తిగా తెలుసుకున్నవారికి సకల సిద్ధులూ లభిస్తాయని పెద్దలు చెబుతారు. శైవ సంప్రదాయంలో కూడా వీణాధారిణి అయిన పార్వతీ రూపాలున్నాయి. అన్ని సరస్వతీ స్వరూపాలు ఆరాధించదగినవే. మన అజ్ఞానమే మన పాలిట రాక్షస శక్తి. దాన్ని తొలగించుకోవాలంటే గొప్ప జ్ఞానమనే మహాధారణ కావాలి. అదే మహాసరస్వతి! ఒకప్పుడు దసరాల్లో బడి పిల్లలతో గిలకలు పట్టించడమనే మంచి ఆచారం ఉండేది మనలో. అవే ధనుర్బాణాలు. ఇంటింటికీ ఉపాధ్యాయులతో విద్యార్థులు వచ్చి రంగు పొడుం బాణానికి సంధించి ఇంటి ముందు కొట్టేవారు. దానికర్థం ప్రతీ వారిలోనూ ఉండే జడత్వం అనే రాక్షసుణ్ణి సంహరించి చైతన్యాన్ని పుట్టించడం. నిజానికి మన అసలైన శత్రువు ఏమీ చేయలేని జడత్వమే. దసరాల్లో మహాసరస్వతీ ఉపాసన ద్వారా తొలగించుకుని జ్ఞాన చైతన్యులం కావాలి. అందుకే శరన్నవరాత్రులను సరస్వతీదేవి పేరిట శారదా నవరాత్రులు అని కూడా అంటారు. ‘విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా’ అంటూ అక్షరాభ్యాసం నాడు పిల్లలతో అనిపిస్తారు. మానవుడు అక్షరాభ్యాసం నుండి ఆమరణాంతం మహాసరస్వతిని ఆరాధిస్తూనే ఉండాలి.

 జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.