ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?



వేణీదానం ఇదేమిటీ అనుకుంటున్నారా! అవును ప్రపంచంలో,రెండేరెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారు. దానిలో మొదటిది "వేణిదానం" రెండవది మహిషిదానం

తీర్ధరాజ్ గా పిలువబడే అలహాబాద్ లోని ప్రయాగ త్రివేణీ సంగమం దీనికివేదికగా,గంగా యమున సరస్వతి నదులపవిత్రసంగమం లో ఈ వేణీదానాన్ని నిర్వహిస్తారు.

జీవితకాలంలో మహిళలకు సంబధించిన రుతుదోషాలు,రుతుకాలంలో వంటచేయటం, అలాగే భర్త సముఖం లో లేనప్పుడు అలంకరించుకోవటం, ప్రసవ సమయలో గర్భదోషాలు,భర్తను దూషించినా, తాడనం(దండించటం) స్త్రీలకు సంబంధించి ఏదోషనివృత్తికైనా ఈ వేణీదానపూజ చేస్తారు.

భార్య భర్తలు నూతనవస్త్రాలు ధరించి,విఘ్నేశ్వర పూజ,వేణీదానపూజ నిర్వహించి,భార్యను భర్త ఒడిలో కూర్చుండపెట్టుకోని, జడవేసి కత్తెరతో జడలోని చివరికొసలను కత్తిరించి,ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీదేవతలకు దానం చేయాలి. మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు. కానీ ఈ క్షేత్రంలో కేశాలను మునగటం గమనించవచ్చు.

జీవితం లో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా,ఈ కార్యక్రమం ఒకసారే చేయాలి. మనపాపాలు మనకేశాలను అంటిపెట్టుకోని వుంటాయి. అందుకే తిరుపతి వెళ్ళినా,గయ,ప్రయాగ క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు.తల్లిదండ్రులు గతించినా, ముండనం చేయించుకోవటం తప్పనిసరి.

ముండనం ప్రయాగలో, దండనం కాశీక్షేత్రం లో, పిండనం గయాక్షేత్రం లో తప్పనిసరి. పాండవులనాటి అశ్వత్థవృక్షంఈ క్షేత్రంలో చూడవచ్చు. 

ఆ వృక్షం వేర్లు గయలో,కాండం కాశీలో, చెట్లకొమ్మలు ప్రయాగ లో చూడవచ్చు. 

ఇక్కడ పితృకార్యక్రమం తప్పనిసరి.

సర్వేజనా సుఖినో భవంతు ,

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.