నవరాత్రి.. మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం.. || Navaratri 2024 First Day

 

                నవరాత్రి.. మొదటిరోజు 

అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

నవరాత్రులలో అతి ముఖ్యమైన రోజు ఆశ్వయుజ మాస శుక్ల పాడ్యమి అయినటువంటి మొట్టమొదట రోజు. ఈరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో కలశస్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్టించి తొమ్మిదిరోజులు ఒక్కొక్క అవతారములో అలంకరణ చేసుకుంటూ ఆరాధన వంటివి ఆచరించినట్లయితే అమ్మ వారి అనుగ్రహం చేత అభీష్టసిద్ధి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని మాతా హవనిజా గారు తెలిపారు.

దేవీ నవరాత్రులలో విశేషంగా మొట్టమొదటి రోజు అమ్మవారిని పూజించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహంచేత అభీష్టసిద్ధి కలుగుతుందని దేవీపురాణం వంటి పురాణాలలో తెలియచేసినట్లుగా చిలకమర్తి తెలిపారు. వసంత బుతువు దేవీ పూజకు ఎంత శ్రేష్టమో, శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్టం. వేదాలు ఆవిర్భవించక పూర్వం నుందే శ్రీ శక్తిని పూజించే విధానం ఉందని పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తోందని మాతా హవనిజా తెలిపారు.

మొదటి రోజు అవతారం: శ్రీ బాల త్రిపురసుందరీదేవి అవతార విశిష్టత

దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పాడ్యమి రోజున శక్తి స్వరూపిణిని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో అలంకరిస్తారు. త్రిపురత్రయంలో ప్రథమ శక్తి స్వరూపిణి ఈ దేవత.

ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలందుకుంటుంది. ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్నాతే ఈ బాల త్రిపురసుందరీదేవి. త్రిపురాంతకం అనబడే ఒక శైవక్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు.

త్రిపురాసురుడనే ఒక భీకర రాక్షసుడ్ని అంతమొందించి, భక్తుల కొంగుబంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు, త్రిపురసుందరీదేవి ఈ క్షేత్రంలో కొలువై యున్నారు. ఈ అవతారంలో అమ్మ అభయహస్త ముద్ర కలిగి అక్షరమాలను ధరించి ఉంటుంది. దేదీప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో నిలుపుకుని, ఆరాధిస్తే భక్తుల మనస్సుని బుద్ధిని తేజోవంతం చేస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు బాలికలకు పూజలు చేసినట్లయితే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుంది. శ్రీచక్రంలోని ప్రథమ దేవత ఈ రూపం. సమస్త కళలకు అధినేత ఈ దేవత. ఏ కళలో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మనమీద పడాలి. ఈ బాలాత్రిపురసుందరీదేవి ఆరాధనంలో భాగంగానే నవరాత్రులలో బాలపూజ విశిష్ట స్థానం పొందింది. 

ఈరోజు 

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాల

త్రిపురసున్దర్యై నమః 

అని వీలైనన్ని సార్లు జపించుకుంటే చాలా శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ బాలత్రిపురసుందరి దేవీ అష్టోత్తరంతో షోడశోపచార పూజ చేసి పెసరపప్పు, పాయసం నివేదన చేయాలి. ఈరోజు ధరించవలసిన వర్ణం లేత గులాబీరంగు.

జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.