మీ సొంతింటి కల నెరవేరాలంటే.?

                                                   గృహ యోగము-స్వంత ఇల్లు.


చాలామందికి స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది.ఎంత ప్రయత్నించినా ఇంటిపని పూర్తికాకపోవచ్చు.చేతిలో డబ్బు ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవడం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది.జాతకంలో  లగ్నం నుండి చతుర్థ భావమనేది జాతకుడు యొక్క ఇంటి విషయాన్ని తెలియజేస్తుంది. జాతకంలో గృహస్థానంలో రవి భగవానుడు ఉన్నప్పుడు ప్రభుత్వ క్వార్టర్స్ లో  వుండవచ్చు లేదా ప్రభుత్వం సహాయంతో ఇల్లు కడుతూ ఉంటారు.చతుర్థ స్థానం లో చంద్రుడు ఉంటే అద్దె ఇంట్లో ఉంటారు లేదా సొంతిల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు.   కుజుడు ఉంటే వీధిపోట్లు ఉన్న గృహంలో నివసిస్తూ ఉంటారు.చతుర్థ స్థానంలో  బుధుడు ఉన్నప్పుడు అందమైన గృహంలో ఉంటారు.చతుర్థ స్థానంలో  గురుడు ఉన్నప్పుడు   గృహాలు కట్టి అమ్ముతూ ఉంటారు.వ్యాపారం చేస్తుంటారు.అదే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అందమైన రాజప్రాసాదం వంటి ఇంట్లో ఉంటారు.శనిభగవానుడు ఉన్నప్పుడు ఇల్లు కానీ ఇంటి స్థలం గానీ ఉంటుంది కానీ కోర్టులలో  గొడవలు తో ఉంటారు.చతుర్థ స్థానంలో  రాహువు కానీ కేతువు ఉన్నప్పుడు ఇల్లు కడుతూ వుంటారు సమస్యలు ఎక్కువయి అమ్ముతూ ఉంటారు. అలా మారిపోతూ ఉంటారు. లగ్నం నుండి నాలుగో స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు అందమైన ఇల్లు స్వంత ఇళ్ళు ఉంటాయి.అవే పాప గ్రహాలు ఉన్నప్పుడు గృహ పరంగా అనేక ఇబ్బందులు  ఎదుర్కొంటూ అద్దె ఇళ్లలో ఉండడం లేకపోతే ఇల్లు మారుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది.   పాప గ్రహాల ఉన్నపుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే సొంత ఇల్లు కల నెరవేరుతుంది.ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు కానీ, గురువారం పుష్యమీ నక్షత్రం ఉన్నప్పుడు గానీ, లేదా శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం ఉన్నరోజున కానీ  పదకొండు మేడిచెట్లు భూమి మీద నాటి వాటిని పోషించాలి.గురువారం పుష్యమి నక్షత్రం, ఆదివారం పుష్యమి నక్షత్రం,పూర్వాషాఢ నక్షత్రం శుక్రవారం అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి.అవకాశం  ఉంటే ఈ సమయంలో నాటడం మంచిది లేదా రవి హోర లేదా బుధ హోర సమయాల్లో అయినా సరే ఈ మొక్కలను నాటడం మంచిది.ఈ మొక్కలు బతికి చిగురు పడుతున్నాయంటే మీ జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోయి మీరు సొంత గృహానికి యజమానులు అవుతారు. 

జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.