సంతానం విషయంలో ఇబ్బందులు తొలగి, సుఖ సంతోషాలతో జీవించలంటే.??


                                                     సంతానము వలన సుఖము

తమ పిల్లలు భవిష్యత్తులో తమను ఆదరిస్తారా లేదా అనేది ప్రస్తుత కాలంలో ఒక సమస్యగా ఉంది ఈ సమస్య కోటీశ్వరుల నుండి సాధారణ వ్యక్తుల వరకు కూడా ఉందని చెప్పాలి. తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కానీ పిల్లలు తన అవసాన దశలో ఆదరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది. జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి, ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు తమ పిల్లలు తమను ఆదరిస్తారు అనేది తెలుసుకోవచ్చు ఈ కారణంగా భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు సరిపడా ధనాన్ని నిలువ ఉంచుకుంటే అది అత్యవసర సమయంలో కాపాడుతుంది. జాతకంలో పుత్ర కారకుడు అయిన గురు భగవానుడు లగ్నంలో కానీ కర్కాటకంలో లేదా ధనుస్సు లేదా మీనం ఈ నాలుగు స్థానాలలో ఏ ఒక్క స్థానంలో అయినా గురుడు స్థితి పొందినట్లయితే మీ పిల్లలు నుండి మీరు ఆదరణ కచ్చితంగా పొందుతారు. లేదా మీ జాతకంలో పంచమాధిపతి శుభగ్రహమైనా లేదా పాప గ్రహమైనా సరే బలంగా ఉండాలి అనగా గురువు యొక్క దృష్టి కానీ గురువుతో కలిసి గానే ఉండాలి. ఈ రెండు నియమాలలో ఏ ఒక్కటి అయినా మీ జాతకంలో ఉన్నప్పుడు మీ సంతానం మిమ్మల్ని ఆర్థికంగా ఆదరిస్తారు మరియు వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉండి సహాయం చేస్తారు. గురువు బలంగా ఉండాలి గురువు బలహీనంగా ఉండడము అంటే గురువు రాహువుతో దగ్గర డిగ్రీలు లో ఉండకూడదు, శని భగవానులతో తక్కువ డిగ్రీలలో కలిసి ఉండరాదు.గురువు నీచ పొంది ఉండకూడదు. లగ్నంలో దిగ్బలాన్ని పొందే గురు భగవానుడు సప్తమ స్థానంలో నిష్పలితాన్ని పొందుతారు. సప్తంలో కూడా గురుడు ఉండరాదు అనగా గురుడు నీచే పొందినా, రాహు శని భగవానులతో తక్కువ డిగ్రీలలో ఉన్నపుడు మరియు నిష్ఫలితాన్ని పొందినప్పుడు సంతానం నుండి ఆదరణ ఈ జాతకులు ఆశించవలసిన అవసరం లేదు. గురువు రవి భగవాన్ తో కలిసి అస్తంగత్వం పొందినప్పుడు పై నియమం వర్తించదు గురువు యధావిధిగా శుభ ఫలితాలను ఇస్తారు. రెండవ నియమం ప్రకారం పంచమాధిపతి బలంగా ఉండాలి అనగా స్వ క్షేత్రం, ఉచ్చస్థితి,మూల త్రికోణం, దిగ్బలం ఈ నాలుగు విధాలలో ఏదేని ఒక విధంగా బలంగా ఉన్నప్పుడు సంతానం తనను కచ్చితంగా ఆదరిస్తారు సహాయకారిగా ఉంటారు. పంచమాధిపతి బలహీనమైన అనగా పంచమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్న నీచ పొందిన పంచమ స్థానంలో పాప గ్రహాలు ఉన్నా మీరు భవిష్యత్తు అవసరాల కొరకు ఆర్థికంగా పొదుపు చేయవలసినదే ఎందుకంటే ఈ జాతక స్థితి ఉన్నప్పుడు మీరు మీ పిల్లలకు భారమవుతారు. మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు మీరు కచ్చితంగా పాటించండి. పిల్లలకు మంచి విద్య అందించడం,వివాహం చేయడం విదేశాలకు వెళతానంటే పంపించడం వేరే ఊర్లో స్థిరపడతాను అంటే ఒప్పుకోవడం వంటివి మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేయండి. కానీ భవిష్యత్తులో మీ అవసరాల కోసం వారి మీద ఆధారపడకుండా మీరు సిద్ధం కావాలి. తమ సంతానం తనను ఆదరించరు అని వారి మీద ద్వేషం పెంచుకోరాదు. మీ జాతకంలో సమస్య ఉన్నప్పుడు వారిని నిందించరాదు. పిల్లల సపోర్టు చేయరు అనడానికి రెండు కారణాలు ఉంటాయి వారి దగ్గర ధనం ఉండి సపోర్ట్ చేయలేకపోవచ్చు లేదా మీకు చేద్దామని అనుకున్నప్పటికీ వారి దగ్గర ఆర్థికంగా సరైన సమర్థత లేకపోవచ్చు. కావున సంతానాన్ని నిందించకుండా మీ జాతకరీత్యా మీరు ముందుగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆశిస్తూ.. మీ హవనిజా మాత.. 

జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.