కలి జన్మ రహస్యం

 



నలుగురు అన్న, చెల్లెళ్ళు తప్పు చేస్తే కలి ఉద్భవించింది. 

శ్రీ కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన రోజే కలి భూమి మీద ప్రవేశించింది. 

బ్రహ్మదేవుని యొక్క వెనకాల భాగం నుంచి స్వీయపాదము అనే శక్తి పుట్టింది. ఆ శక్తికి అధర్ముడు అనే పేరు పెట్టారు. ఆయన భార్య పేరు మిథ్య. ఆమె పిల్లి కళ్ళతో చాలా అందంగ ఉండేది. వీరికి దంభుడు (కపటం) మరియు మాయ అనే కూతురు పుట్టారు. ఈ అన్న, చెల్లెలు ధర్మ విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి లోభుడు (ఆశ) అనే కుమారుడు, నికృతి (కపటం) అనే కుమార్తె పుట్టారు. వీళ్ళు ఇద్దరు కూడా ధర్మం తప్పి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి క్రోధుడు (కోపం) మరియు హింస (వయలెన్స్) అనే కుమార్తె పుట్టారు. వీళ్ళు కూడా ధర్మం తప్పి వివాహం చేసుకున్నారు. వీళ్ళకి కలి పురుషుడు జన్మించాడు. అతను పుట్టిన వెంటనే తన ఎడమ చేతితో తన మర్మ అంగాన్ని, కుడి చేతిలో తన నాలుకని పట్టుకుని వికృతంగా నవ్వాడు. 

దీని అర్ధం ‘ప్రతి వారిని కామానికి, రుచులకి, అసత్య, దుష్ పలుకులకి’ బానిసలని చేస్తాను. 

కలికి అసంఖ్యాకంగా పుత్రులు, పౌత్రులు పుట్టారు. 

పురాణాలలో కలి చెప్పీన విషయాలు 

‘ఈ విశ్వంలో నేను యజ్ఞం, యాగం, ధర్మం, దానం, వ్రతం జరగనీయకుండా అంత నాశనం చేస్తాను. జనులని కామ, భోగాల వైపు తిప్పి వాటికి బానిసలని చేస్తాను. 

ఎవరైనా ధర్మ ప్రవచనాలు, ధర్మ కార్యాలను చేసి జనులని ప్రేరేపిస్తే వాళ్ళని కష్టాలపాలు చేస్తాను. అలాగే, కుటుంబాల మధ్య వైరాలు కల్పిస్తాను. 

నేను ఉండే ప్రదేశాలు. మధ్యపానం, జూదం, వ్యభిచారం, ప్రాణివధ చేసే ప్రాంతాలు (non veg selling and eating places). ‘

కలి యుగంలో కలి బారి నుంచి తప్పించుకునే మార్గాలు. 

పూజ, ధ్యానం, దైవ నామస్మరణ, ధర్మ ప్రవచనాలు. 

పాప ఆలోచన వచ్చినా పరవాలేదు. కాని, పాపం చెయ్యకూడదు. 

మంచి అనుకుంటేనే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి 

‘సర్వే జనా సుఖినోభవంతు!’

‘లోకా సమస్త సుఖినోభవంతు’

‘అస్మిన్ దేశే గోవధ నిషేదార్ధం, గోసంరక్షణార్ధం’. 

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు