వారాహీ నవరాత్రులు జూలై 6 నుండి ప్రారంభం

 


వారాహీ దేవిని పంచమీ అనే నామంతో అర్చిస్తారు. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీ దేవి యొక్క నవరాత్రులు. `భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం' అని శ్యామలా వారాహీ సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీ దేవి.

ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి, వారాహీ దేవికి సంబంధించినవి. సుభద్రా దేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియా శక్తికి ప్రతీక అయిన వారాహీ దేవిగా కొలుస్తారు. అంతే కాక జగన్నాథస్వామి కాళీ దేవి రూపం కూడా. 

శ్రీ కృష్ణుడు కూడా కాళీదేవియొక్క రూపమే కదా.."కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో" అని భగవద్గీతలో చెప్పినట్లు. ఇక బలభద్రుడు బలరాముని రూపం. వారాహీదేవికి లాగే బలభద్రునికి కూడా హలము (నాగలి) ఆయుధం. ఈ 9 రోజులు పూరీలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో ఇవాళ (పంచమి) వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతే కాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరీలో బలభద్రుని ధ్యానశ్లోకంలో " శాంతం చంద్రాదికాంతం ముసల హల ధరం" అని వారాహి యొక్క ముసలము, హలము రెండిటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది.

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్!

అనేక రూపదైత్యాన్తం నమామి పురుషోత్తమమ్!!

విశ్వవ్యాపకుడు, జయశీలుడు, మహావిష్ణువు, ప్రకాశశీలుడు, సర్వ శాసకుడు, అనేక రూపములతోనున్న దైత్యులను నశింపజేసే బహు అవతార స్వరూపు డైన పురుషోత్తముని నమస్కరించుచున్నాను.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు