కర్మకి అతీతులు ఎవరు.?
కర్మను ఎవరు నిర్ధేశిస్తారు, కర్మ ప్రారబ్ధవశం కర్మను ఆచరించటమే కర్తవ్యం. పరమశివుడికి ఏమికర్మ ఉందని దక్షునితో అవమానం జరిగింది. భర్తకు జరిగిన అపచారానికి జగన్మాత ఏమి కర్మ ఉందని యోగాగ్నిలో భస్మం అయ్యింది. సీతమ్మవారికి ఏమి కర్మ ఉందని కష్టాలు వచ్చాయి. పరమోత్తములు శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడికి ఏమి కర్మ ఉందని రాక్షస సంహారం చేశారు. ఆదిశేషుని అవతార మూర్తి అయిన లక్ష్మణుడు నాగాస్త్రం ధాటికి ఎలా ఒరిగాడు. యోగం-కరణం అనేవాటి ద్వారా సీతాపహరణ, తిరిగి ఏడాది తర్వాత చేరుకుంటారని సంపాతి రామునకు కర్మ వైశిష్ట్యాన్ని వివరించాడు. కర్మ శరీరానికి తప్పని విధి. దాన్ని ధర్మబద్ధంగా ఆచరించటమే మనందరికి యోగం-క్షేమం.
పురాణాలు కధలు కావు, చరిత్ర యని మనము గమనించుకోవాలి.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment