అదృష్టం-ఐశ్వర్యము - Astro Remedies
అదృష్టం-ఐశ్వర్యము
ప్రతి ఒక్కరూ స్నానం చేసే సమయంలో సరైన పద్ధతులు పాటిస్తే అదృష్టము అదేవిధంగా ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది.తలస్నానము,తలంటుస్నానం అని రెండు రకాలుగా ఉంటాయి.తలమీద మామూలుగా నీటిని పోసుకుంటే దాని తల స్నానం అంటారు.అలాకాకుండా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని,తలకి నూనె రాసుకుని షాంపూతో కానీ కుంకుడు కాయతో కాని తల స్నానం చేస్తే దానిని తలంటు స్నానం అంటారు.
ఆడవాళ్ళ ప్రతిరోజు తలస్నానం చేయరాదు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఆడవాళ్ళు తలస్నానం చేయవచ్చు.ఆడవాళ్లు సాధారణంగా కంఠస్నానం చేయాలి.శుక్రవారం అయితే తలంటు స్నానం చేయవచ్చు,లేదా తలస్నానం అయినా చేయవచ్చు.వివాహం అయిన మగవాళ్ళుప్రతిరోజు తలస్నానం చేయడం మంచిది అలా చేస్తే పూజా ఫలితం పెరుగుతుంది.మగ వాళ్ళు సోమవారం, బుధవారం, శనివారం తలంటు స్నానం చేయడం వలన అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా బుధవారంనాడు తలంటు స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడవచ్చును అదృష్టం బాగా కలిసి వస్తుంది.ఆదివారం ఎటువంటి పరిస్థితులలోనూ కూడా తలంటు స్నానం చేయరాదు అలా చేస్తే మొత్తం అదృష్టం అంతా పోతుంది,ధననష్టము ఆరోగ్య నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.ఆడవాళ్లు మంగళసూత్రంలో పిన్నీసులు ఉంచితే భర్త యొక్క అదృష్టం తగ్గిపోతుంది.భర్త బయటకు వెళ్లేటపుడు భార్య యొక్క కుడి చేతిని తాకి బయటికి వెళితే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది.ఆడవాళ్లు తులసి చెట్టు యొక్క వేరును రాత్రి పడుకునే ముందు తలగడ కింద పెట్టుకుని పడుకుంటే ఆడపడుచు,అత్తగారూ యొక్క పోరు తగ్గుతుంది.భర్త వ్యసనాల బారిన పడి భార్యను పిల్లలను కుటుంబాన్ని పట్టించుకోకపోతే ప్రతిరోజూ కరక్కాయ పౌడర్ ను కొద్దిగా పాలలో కలిపి భర్తతో తాగించండి 41రోజుల తరవాత వ్యసనాల నుండి బయటపడి ఆ భర్త పిల్లలను కుటుంబం పట్ల ప్రేమను వ్యక్తం చేస్తాడు. భర్త ఎటువంటి వ్యసనాలకు గురి అయినా ఆ సమస్య నుండి బయటపడే మార్గం జ్యోతిష్య శాస్త్రం దారి చూపిస్తుంది. జాతకాన్ని పరిశీలించి దానికి తగిన పరిహారం పాటించిన యెడల పర స్త్రీ ఆకర్షణ, మద్యానికి బానిసవ్వడం వంటి వ్యసనాలు నూటికి నూరు శాతం తొలగించవచ్చు.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment