Posts

Showing posts from November, 2023

కార్తీక మాసం - కార్తీక దీప దానం” చేస్తే కలిగే ఫలాలు

Image
    🌿షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం. 🌸కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ధాత్రీ అంటే ఉసరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో దేవాలయం/ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి. 🌿 దీంతోపాటు ఈ మాసంలో దీప దానంతో చేస్తే విశేష ఫలితాలు వస్తాయని పురాణాల్లో ఉంది. దీపదానం అంటే వెండి,బంగారం, ఇత్తడి, ఉసరికాయ, పిండి, సాలగ్రామంతో సైతంగా ఇలా రకరకాలుగా ఇస్తారు.  🌸దీనివల్ల అస్థిరమైన శరీరంపై మమకారం పోవాలని అంటే నేను అనే అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దీప దానం చేస్తారు.  🌿షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం. 🌸ఎన్ని దానాలు చేసినా దీప దానానికి సరిరావు. కార్తీక మాసంలో దీప దానం అన్నింటికంటే శ్రేష్ఠమైనది.  దీప దానం చేసే ముందు పళ్లెంలో బియ్యం పోసి, మూడు కుందులు ఉంచాలి. వాటిలో ఆవు నూనెతో దీపారాధన చేయాలి.  🌿మూడు దీపాల్లో దూది వత్తులను మాత్రమే ఉంచాలి. మూడు ప్రమిదల చుట్టూ ఏడు ఉసిరికాయలను ఉంచాలి.  🌿వాటిపై నేతిలో తడిపిన నిలువు వత్తులను వెలిగించాలి

లలితా సహస్ర నామాలు చదివితే ఫలితం

Image
  1. గంగా స్నానము ఫలితం కలుగుతుంది 2. కాశీ క్షేత్రములో కోటి లింగములను ప్రతిష్టించిన ఫలితం కలుగుతుంది 3. కోటి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. 4. కోటి అశ్వమేదముల దానం చేసిన ఫలితం కలుగును. 5. విప్రునకు కోటి బారువుల బంగారాన్ని దానం చేసిన ఫలితం కలుగును. 6. ఎడారిలో కోటి బావులను త్రవ్విన ఫలితం కలుగును 7. కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కలుగును 8. ఒక్క నామం చదివిన జన్మంతర పాపములు పోవును. 9. పుట్టిన రోజునుండి మూడవ రోజున ఒక శక్తి వస్తుంది. ఆ రోజున పటిస్తే చాలా విశేషం. 10. శుక్లపక్ష నవమి, శుక్లపక్ష చతుర్థశి నాడు మరియు శుక్రవారం చదవాలి. 11. పూర్ణిమ వచ్చినప్పుడు మరింత విశేషం 12. నామ దృష్టితో కాకుండా,మంత్ర దృష్టితోచదవాలి సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ క

కార్తీక వనభోజనాల విశిష్ఠత

Image
  💐వనభోజనాం💐 ‘వనము’ అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో.., తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో., రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట  జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు తప్పకుండా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారుగానీ..., అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు, క్రూరత్వానికి తావులేనిది ‘వనము’. అట్టి వనము దేవతా స్వరూపము. ఎందుకంటే.. పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు.., దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము. అట్టి వనాలను యేడాదికి ఒక్కసారైనా., ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటంటే.... - కార్తీకమాసం నాటికి... వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి.  చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్న

కార్తీక పురాణము - పద్దెనిమిదవ అధ్యాయము

Image
    Kartika Puranam - 18 ఆ అద్భుతపురుషుడు "మునీశ్వరా! నేను అనుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని.ఓ!మునివర్యా!నాకు నీవే తండ్రివి.నీవే సోదరుడవు.నీవే గురుడవు.నేను నీకు శిష్యుడను.దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరు?పాపవంతుడైన నేనెక్కడ? ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ?పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ? ఈ విష్ణుసన్నిధి ఎక్కడ/ ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా?నాకేదో పూర్వపుణ్యమున్నది.దానిచే ఇది లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము". "మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము.నీ వాక్కు అను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి?" అని అడుగగా అంగీరసుడు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది.లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదవినుము.అనిత్యమైన దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూ

దేవి ఖడ్గ మాలా స్తోత్రాన్ని రెండుసార్లు వినడం ద్వారా

Image
  1)శ్రీ చక్రార్చన పూజా ఫలితం వస్తుంది 2) విశేషించి ప్రస్తుత యుద్ధం ప్రజల్ని సామాన్యుల్ని అమాయకుల్ని స్త్రీలను పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఆ ఉపద్రవం తొలగడానికి ఈ స్తోత్రాన్ని వింటూ అమ్మవారిని ప్రార్థించినట్లయితే యుద్ధ నివారణ జరుగుతుంది 3) సామాన్యంగా ఈ స్తోత్రం సిద్ధిని కలుగజేస్తుంది 4) అగ్ని వల్ల/వాయువు వల్ల పెద్ద క్షోభ కలిగినా 5)రాష్ట్రానికి దేశానికి విప్లవాలు వచ్చినా 6)పెద్ద పెద్ద దొంగతనాలు జరిగినా 7) యుద్ధం జరుగుతున్నా 8) నీటి యొక్క ఉపద్రవాలు వచ్చి దేశాన్ని అల్లకల్లోల పరుస్తున్నా 9) సముద్ర యానం చేసేటప్పుడు తుఫాను వంటి ఉపద్రవాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా 10) భూత ప్రేతాదుల వల్ల భయాలున్నా 11) మూర్చ వ్యాధి జ్వరము మృత్యు భయాలున్నా 12)క్షామ భయము అంటే నీరు, ఆహరం లేక కరువు కాటకాలున్నా 13)శాకీనీ పూతన యక్షులు రాక్షసులు వంటి దుష్టశక్తుల వల్ల ఇబ్బందులున్నా 14) మిత్రులకు భేదం వచ్చి మళ్లీ వాళ్లు కలవాలనుకుంటున్నా 15) గ్రహదోషాలున్నా 16) పెద్ద పెద్ద కష్టాలున్నా 17) ఎవరో మనపై ప్రయోగం చేశారన్న భావన ఉన్నా 18) దృష్టి దోషాలున్నా అన్నీతొలగి శివాత్మకుడవుతాడు! శివోహం అన్న భావనను పెంపొందించుకోగల వాడవుతాడు!

అందరూ ఒకసారి ఇలా చేసి చూడండి🌷🌼🌷

Image
  ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవికి చెరకు రసం సమర్పించ౦డి.అమ్మవారి కృపతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.🌷🌼🌷 శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం . శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి.🌷🌼🌷 లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటిస్తాము. వీటితోపాటు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి.అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.🌷🌼🌷 లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి.పూజ అంతా అయ్యాక ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం,అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం.🌷🌼🌷 ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలాగా చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ

శ్రీ గరుడ పురాణము (8)

Image
      ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెఱచి మమ్ము చూడగానే ప్రణామం చేసి 'హే సదాశివా! మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీ కంటె గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింత వరకూ ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే, మమ్ము కరుణించి ఆ పరమసారతత్త్వాన్ని మాకూ అనుగ్రహించండి' అని అడిగాను. 'బ్రహ్మాది దేవతలారా! నేను సర్వఫలదాయకుడూ, సర్వవ్యాపీ, సర్వరూపుడూ, సర్వప్రాణి హృదయనివాసి పరమాత్మా సర్వేవరుడూనగు విష్ణుభగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవా!ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్నీ, జటా జూటాన్నీ ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనైవుంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడూ, అద్వైతుడూ, జయశీలుడూ, నిరాకారుడూ, సాకారుడూ, పద్మనాభుడూ, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడూ అయి వుండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూన్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్త్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి' అన్నాడు పరమేశ్వరుడు. ఆ

కార్తీకపురాణం 17 వ అధ్యాయం

Image
    అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము. కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా "ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియైసచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమున

శివ దర్శనం

Image
    కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.  .... శ్రీకోటేశ్వర మరియు శ్రీసోమేశ్వర స్వామి-కోటిపల్లి- తూర్పుగోదావరి జిల్లా.  ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నదీ తీరాన వెలసింది. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి.  గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యంలో...ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని చెప్పబడింది. ఈ క్షేత్రంలో గౌతమీ పుణ్య నదిలో విష్ణు తీర్థ, రుద్ర తీర్థ, బ్రహ్మ తీర్థ, మహేశ్వర తీర్థత, రామ తీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించు చున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన సిద్ధి జనార్ద
Image
 

పంచాంగము

Image
    శుక్రవారం, డిశెంబరు 1,2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు కార్తీక మాసం - బహుళ పక్షం తిథి:చవితి మ3.07 వరకు వారం:శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం:పునర్వసు సా5.07 వరకు   యోగం:శుక్లం రా9.12 వరకు కరణం:బాలువ మ3.07 వరకు తదుపరి కౌలువ తె3.50 వరకు వర్జ్యం:రా1.46 - 3.30 దుర్ముహూర్తము:ఉ8.29 - 9.13 మ12.10 - 12.54 అమృతకాలం:మ2.33 - 4.16 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30 సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:మిథునం సూర్యోదయం:6.17 సూర్యాస్తమయం: 5.20 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ

రాశి ఫలితాలు

Image
    01-12-2023 భృగు వాసరః శుక్రవారం  మేషం  01-12-2023 స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.  --------------------------------------- వృషభం  01-12-2023 సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. --------------------------------------- మిధునం  01-12-2023 సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. --------------------------------------- కర్కాటకం  01-12-2023 భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సా

పంచాంగము

Image
    గురువారం, నవంబరు 30,2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు కార్తీక మాసం - బహళ పక్షం తిథి:తదియ మ2.07 వరకు వారo:గురువారం (బృహస్పతివాసరే) నక్షత్రం:ఆర్ద్ర మ3.33 వరకు   యోగం:శుభం రా9.29 వరకు కరణం:విష్ఠి మ2.07 వరకు తదుపరి బవ రా2.36 వరకు వర్జ్యం:తె4.19 - 6.01 దుర్ముహూర్తము:ఉ9.57 - 10.41 & మ2.22 - 3.07 అమృతకాలం:ఉ6.46వరకు రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30 సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి:మిథునం సూర్యోదయం:6.16 || సూర్యాస్తమయం:5.20 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధా

శ్రీ విధాత పీఠం లో

Image
  భగవత్ భందువులందరికిీ శ్రీ విధాత పీఠంలో సంకటహరచతుర్థి  సందర్భంగా సంకష్ట గణపతి హోమం హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును. మీ మీ గోత్ర నామాలతో పూజ జరిపిం చుకో దలచిన వారు 516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 096666 02371

సంకటహరచతుర్థి పూజవ్రతవిధానంమరియుసమగ్రవివరణ

Image
  గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని , పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం  వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక

"ఐశ్వర్యానికి కారకుడు శివుడు"

Image
       ఐశ్వర్యానికి కారకుడు శివుడు..       ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి.. మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే... 'అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీద