కార్తీకపురాణం - 5 వఅధ్యాయము - karthika Masam
కార్తీకపురాణం - 5 వఅధ్యాయము. వనభోజన మహిమ: కిరాత మూషికములు మోక్షము నొందుట! ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికి విష్ణు లోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంఠస్థమొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను” - యని వశిష్టుల వారు చెప్పిరి. అది విని జనక రాజు 'ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను?