Posts

రాశిఫలాలు - మే 30, 2025

Image
  మేషం కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వృషభం విదేశయాన ప్రయత్నంసులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథునం వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. కర్కాటకం నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. సింహం ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం ...

పంచాంగం - మే 30, 2025

Image
ఓం శ్రీ గురుభ్యోనమః  శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణ పక్షం విక్రం సంవత్సరం  -  కాళయుక్తి 2082, జ్యేష్ఠము 3 ఇండియన్ సివిల్ క్యాలెండర్  -  1947, జ్యేష్ఠము 9 పుర్నిమంతా  -  2082, జ్యేష్ఠము 18 అమాంత  -  2082, జ్యేష్ఠము 3 తిథి శుక్లపక్షం చవితి    -  May 29 11:18 PM – May 30 09:23 PM శుక్లపక్షం పంచమి    -  May 30 09:23 PM – May 31 08:15 PM నక్షత్రం పునర్వసు  -  May 29 10:38 PM – May 30 09:29 PM పుష్యమి  -  May 30 09:29 PM – May 31 09:07 PM కరణం పణజి  -  మే 29 రాత్రి 11:18 – మే 30 ఉదయం 10:15 భద్ర  -  May 30 10:15 AM – May 30 09:23 PM బవ  -  మే 30 రాత్రి 09:23 – మే 31 ఉదయం 08:43 యోగం గండము  -  May 29 03:46 PM – May 30 12:56 PM వృద్ధి  -  May 30 12:56 PM – May 31 10:43 AM వారపు రోజు  శుక్రవారము పండుగలు & వ్రతాలు చతుర్థి వ్రతం సూర్య, చంద్రుడు సమయం సూర్యోదయము  -  5:45 AM సూర్యాస్తమానము  -  6:4...

సత్సంగం

Image
  సత్సంగం  మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు!  ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు! మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచి పోయేలా చేస్తుంది కాలం! విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు! ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.! చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం కూడా మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో  ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతా...

హనుమాన్ సర్వస్వం

Image
  హనుమాన్ సర్వస్వం పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు.  🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు? జవాబు : అంజనా దేవి ! 🚩2) హనుమంతుని తండ్రి పేరు? జవాబు : కేసరి ! 🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు? జవాబు : కశ్యపుడు ! 🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు? జవాబు : సాధ్య ! 🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది? జవాబు : వైశాఖ బహుళ దశమి! 🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది? జవాబు : తిరుమల  - అంజనాద్రి. 🚩7) హనుమంతుని నక్షత్రము ? జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము. 🚩8) హనుమంతుని జనన లగ్నం  ? జవాబు : కర్కాటక. 🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ? జవాబు : వైదృవీయోగం లో  🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ? జవాబు : ఈశ్వరాంశ  🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ? జవాబు : వాయుదేవుని వరం వలన. 🚩12)హనుమ జనన కారకులు ? జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు. 🚩13) హనుమంతుని గురువు ?  జవాబు : సూర్య భగవానుడు. 🚩14) హనుమంతుని శపించిన వారు ?  జవాబు : భృగుశిష్యులు. 🚩15) హనుమంతునికి గల శాపం ?  జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం. 🚩16) హనుమంతుని శాప పరిహారం ?  జవాబు : స్తుతి...

ధర్మసందేహాలు

Image
ధర్మసందేహాలు  బొట్లు పెట్టుకోవడం, రుద్రాక్షలు, తులసిమాలలు వేసుకోవడం 'ప్రదర్శన' అనిపించుకోదా? భక్తి మనసులో ఉంటే చాలదా? మనసులో ఉంటే తప్పకుండా బయటా ఉంటుంది. శరీరాన్ని శుద్ది చేసే విధానాల్లో ఇవి ఒకటి. వీటిని దైవచిహ్నాలు, దైవరక్షలు అంటారు. ఇవి ప్రదర్శన కోసం అనడం తగదు. అయితే కొందరు ఆడంబరం కోసం వేసి ఉండవచ్చు. కానీ అందరిదీ అదే పద్దతి అనడం తగదుకదా. శాస్త్ర రీత్యా భూమధ్యం (కనుబొమ్మల నడుమ) జ్ఞానరూపుడైన దైవం యొక్క స్థానం. అక్కడ బిందు రూపుడిగా భగవంతుని ధ్యానించే యోగ విధానమూ ఉంది.  అలాగే రుద్రాక్ష, తులసి, స్పటికం- వీటి వైద్యమహిమలు కూడా ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ చిహ్నాలధారణ కనబడుతుందనీ కనిపించని సూక్ష్మజగత్తులో కూడా రక్షణ ఇస్తుందని వేదపురాణాలు, మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. భక్తులైన వారికి దైవంపైనా, శాస్త్రం పైనా నమ్మకం ఉంటుంది. ఈ చిహ్నాల వల్ల దైవకృప, దైవచింతన నిరంతరం సన్నిహితమవుతుందని భక్తులు దీనిని ధరిస్తారు. అంతేకానీ ఆర్భాటం కోసం కాదు. బైట కనిపించేదంతా మనసులో ఉండకపోవచ్చు గానీ, మనసులో ఉన్నది మాత్రం బైట కనిపించి తీరుతుంది. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వ...

అరుణాచల క్షేత్ర మహిమ ఏమిటీ?

Image
  జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట. ఏమా గీత అంటే... అరుణాచల ప్రవేశానికి పూర్వం, తర్వాత అట. ‘అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు’ అని ఓ సిద్ధాంతం ఉంది. నేనూ ఈ సిద్ధాంతాన్ని నమ్మాను. ఎందుకంటే పదేళ్ల నుంచి అక్కడికి వెళ్లాలని వెళ్లలేకపోయాను. ఈసారి ఎలాగైనా వెళ్లాలని సంకల్పించుకున్నాను. అరుణాచలేశ్వరుడి చుట్టూ 14 కిమీ గిరి ప్రదక్షిణం నడక... ఇది కేవలం యాత్ర కాదు, ఒక జీవన మార్గం. ఈ ప్రదక్షిణ వల్ల మనస్సు శుద్ధి, ఆత్మాన్వేషణ, శివ అనుగ్రహం లభిస్తాయి.  అరుణాచలం ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేయాలి మీకున్నా అన్ని సందేహాలకు ఈ పోస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 . అరుణాచల క్షేత్ర మహిమ ఏమిటీ? అరుణాచలం (తిరువణ్ణామలై) శైవమతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది ఐదు భూతలింగాలలో అగ్నిలింగం కి ప్రతీక. ‘‘అరుణాచలేశ్వరుడు’’ అనగా – ఆరున్ (తేజస్సు), అచల (అచంచలుడు) – శివుడు స్వయంగా తేజోమయంగా లింగరూపంలో వెలసిన స్థలం. శివుడు తన స్వరూపాన్ని చూపించడానికి ఎక్కడో వెలయించబడతాడు కానీ, ఇక్కడ ఆయన స్వయంగా ‘గిరిరూపం’ గా వెలసాడు. అందుకే అరుణాచలం కేవలం శిల కాదు – శివుడే! అరుణాచలం గిరిప్రదక్షిణం చేసిన మహన...

భగమన్నామస్మరణ

Image
  భగమన్నామస్మరణ : దైవశక్తి (మంత్ర శక్తి) ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి పెరుగుతూనే ఉంటుంది. అందువలన చెడు నశిస్తుంది. ఇతని శక్తి రెట్టింపవుతుంది. మొదటిది హింస, రెండోది అహింస. ఆధ్యాత్మికత వలన సమాజము, వ్యక్తి కూడా ఉద్ధరింపబడతారు. సాధన వలన సాధ్యంకానిది లేదు. ఎటువంటి సాధనలు (పనిముట్లు) అవసరం లేకుండానే ఎంతో ఎత్తుకు ఎదగడమే ఆధ్యాత్మికత రహస్యం. శ్రద్ధతో చేసే సాధన వలన మాత్రమే విజయాన్ని పొందగలము. సాధన: భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని చేసే ప్రయత్నాన్నే సాధన అంటాము. అనగా సంస్కారాల మార్పుకు చేసే తీవ్రమైన ప్రయత్నము భగవంతునికి దగ్గర చేస్తుంది. మానవజన్మ సర్వశ్రేష్ఠమైన సంపద. భగవంతుడిచ్చిన అమూల్యమైన కానుక. మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది, అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది, కొలువలేనిది. కర్మతో జన్మ ఎత్తివచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము. పాప, పుణ్యములే సుఖ, దు:ఖములకు మూలము. తెలుసుకుని చేస్తే సాధన. లేదంటే యాతన.కులము అనగా సమూహము. సామూహిక ప్రయత్నం ప్రధానంగా సాధన చేయడం ఆనందదాయకం. అంత:కరణాన్ని శుద్ధం చేసేది సత్సంగమే. ఒంటరిగా కూడా సాధన చ...