Posts

Showing posts from February, 2024

2024 ఫిబ్రవరి 29

Image
  🌷|| ఓమ్ శ్రీ మహాగణాధి పతయే నమః ||🌷 🌷||🔱జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"🔱||🌷 2024 ఫిబ్రవరి 29   శోభకృతు - ఉత్తరాయణం ,శిశిర ఋతువు మాఘమాసే,కృష్ణపక్షే  సూర్యోదయము : 06:28 సూర్యాస్తమయం : 06:02 తిథి:  పంచమి రా॥ 02:18 రకు, తదుపరి   షష్టి ప్రారం|| వారము:  గురు(బృహస్పతి)వారం నక్షత్రం: చిత్త 07:38 వరకు,తదుపరి స్వాతి ప్రారం|| యోగం:  వృద్ధి మ॥ 03:10 వరకు,తదుపరి ధృవం కరణం: కౌలవ మ॥ 02:37 వరకు,తదుపరి గరజి శుభ సమయములు : ప॥ 11:15 — మ॥ 12:00 రాహుకాలం: మ॥ 01:30 — మ॥  03:00 యమగండము: ఉ॥ 06:00— ఉ॥ 07:30 వర్జ్యం: మ॥ 01:22 – మ॥ 03:03 వరకు దుర్ముహుర్తం: ఉ॥ 10:00 — ప॥ 10:48 వరకు, మ॥ 02:48 — మ॥ 03:36 ✍️ 16 సం॥ ల అనుభవముగల జ్యోతిష్యడని నేను మీకు  ఏ సమస్యలుఉన్నా  పెళ్ళి సమస్యలు,ఆర్ధిక సమస్యలు,కుటుంబ సమస్యలు,విద్య,ఉద్యోగం,వ్యాపారం,భార్య-భర్తల మధ్య గొడవలు,ఆరోగ్యస్ధితి-గతులు, విదేశీ యానo,ఆలస్యవివాహ సమస్యల కొరకు చేయవలిసిన పరిహారాలు. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలిం
Image
  ఈ పువ్వును ఎంత మంది చూసారు ? ఈ పువ్వు విశిష్టత తెలుసుకుందామా ? ఇందులో సహజ సిద్ధంగా శివ లింగము, ఆ శివ లింగానికి పడగ పడుతున్నట్లు పైన పువ్వు రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే మనసులో భక్తి భావం కలగడం కూడా సహజమే. కార్తీక మాసంలో ఈ పువ్వుతో పూజలు చూస్తుంటాము. ఈ పువ్వు అన్ని చోట్లా పూయదట, అంతే కాదు అందరికీ కనిపించదు అని కూడా అంటుంటారు పెద్దలు. ఈ చెట్టు దగ్గరలో తప్పకుండా శివాలయం ఉంటుంది అని ప్రతీతి. దీనిని నాగమల్లి పువ్వు అని, శివ లింగం పువ్వు అని కూడా అంటుంటారు.  పూర్వము కాశీ యాత్రకు వెళ్ళే శివ భక్తులు అడవుల మధ్య ప్రయాణించవలసి వచ్చేది. వారికి మార్గ మధ్యంలో ఈ శివలింగం పువ్వుల చెట్లు తారసపడేవి. ఈ పువ్వులను చూడగానే వారు దగ్గరలో శివాలయం ఉంటుందని గ్రహించి, ఆ పరిసరాల్లో గాలించేవారు. వారికి జీర్ణావస్థకు ( శిథిలావస్థకు ) చేరిన పురాతన శివాలయాలు దర్శనమిచ్చేవి. ఆ శివాలయాలను ఉద్ధరించేవారు. ఇలా కాశీకి వెళ్ళే మార్గంలో ఎన్నో అద్భుతమైన, మహామహిమాన్వితమైన శివాలయాలు పునరుద్ధరింపబడ్డాయి. ఈ పువ్వును శివ గణాలలో ఒకటి అని కూడా చెబుతుంటారు. ఈ పువ్వును, దర్శించడం, స్పర్శించడం విశేష పుణ్యప్రదం.  ఓం నమః శివాయ శివాయ నమః

మాఘ పురాణం - 18వ అధ్యాయం

Image
  పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట  వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను. “పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దానధర్మాలు చేయుట గానీ ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లీ నేను ముసలి వాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈరాత్

శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం

Image
    శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. 👉🏾విశేషాలు పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు.  ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర

నిత్య రాశి ఫలాలు.

Image
    2️⃣7️⃣/ఫిబ్రవరి /2️⃣0️⃣2️⃣4️⃣భౌమవాసరే (మంగళవారము) 🐐 మేష రాశిఫలితములు అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా) భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ).          మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని వత్తిడికి గురి అవుతారు. అవిమీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది, ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు. మీరు ఈరోజు మీఅందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు,ముఖ్యంగా కేసలాంకరణకు,వస్త్రధారణకు సమయము కేటాయిస్తారు.దీనితరువాత మీరు మీపట్ల సంతృప్తిని పొందుతారు.           లక్కీ సంఖ్య: 4 🌷 మేష రాశి : తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి... 💥 ఆదిత్
Image
  మకర కుంభములలో, అతి సమీప యుతి తో, కేంద్రీకృతమైన  5 గ్రహ శక్తుల కొనసాగింపు. సోమవారం శక సంవత్సరం: 07-12-1945 (క్రీ.శ.26-02-2024) నాటి ఉదయం గ్రహ స్థితి: (సూ ఉ/అ – 06:40:30/18:17:58గం)🙏 🙏Concentration of 5 Planetary energies in Capricorn and Aquarius with close conjunction continues. Monday, Saka Era : 07-12-1945 (26-02-2024 AD) Planetary position at Sun Rise Time (Sun Rise/ Set – 06:40:30/18:17:58 hrs) సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph: 9666602371

పంచాంగం

Image
    మంగళవారం, ఫిబ్రవరి 27,2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు మాఘ మాసం - బహుళ పక్షం తిథి:తదియ రా11.22 వరకు వారం:మంగళవారం (భౌమవాసరే)  నక్షత్రం:హస్త తె5.20 వరకు  యోగం:శూలం మ2.55 వరకు కరణం:వణిజ ఉ10.22 వరకు తదుపరి విష్ఠి రా11.22 వరకు వర్జ్యం:మ12.08 - 1.54 దుర్ముహూర్తము:ఉ8.43 - 9.29 & మరల రా10.58 - 11.47 అమృతకాలం:రా10.43 - 12.29 రాహుకాలం:మ3.00 - 4.30 యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30 సూర్యరాశి:కుంభం చంద్రరాశి:కన్య సూర్యోదయం:6.24 సూర్యాస్తమయం:6.01 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ

రామాయణమ్ .22

Image
    .గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.  అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.  .జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!. .మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు. .జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి. .అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి , మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది. .మహర్షీ వీరిరువురూ ఎవరు?  పద్మపత్రాల వంటి కన్నులు, అశ్వినీ దేవతల సౌందర్యం, దేవతాసమానపరాక్రమము, గజ సింహ సమానమయిన నడక , చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?  ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు? . జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధాన మిచ్చారు. .వీరు అయోధ్యా పురాధీశుడు దశరధమహారాజు కుమారులు రామలక్ష్మణులు! ..... అని చెప్పి!. .తాటకద్రుంచి వైచి యతిదర్పితుడైన సుబాహుసాయకోత్పాటితు చేసి  గీటడిచి ధర్మ మెలర్పన్

శివుణ్ణి మీరు చూడాలనుకుంటున్నారా ? ... !

Image
    భగవంతునికి ఎన్నో రకాల పూజా విధానాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు పుష్పాలు, ఎన్ని రంగులు, ఎన్ని రకాలు, ఈ దేవునికి ఈ పుష్పం ఇష్టం, ఆ దేవునికి ఆ పుష్పం ఇష్టం అని ఎక్కడెక్కడినుంచో ప్రయాసపడి  తెచ్చి దేవునికి సమర్పిస్తూ ఉంటాం. ఈ రకాల వత్తులు వాడండి ఆ రకాల వత్తులు వాడండి, ఈ షేప్లో ఉన్న వత్తులు వాడండి, ఆ రంగులో ఉన్న వత్తులు వాడండి, ఈ నూనె వాడండి, ఆ నూనె వాడండి అని చెప్పేసి ఒకటేమిటి గంధం విషయం తీసుకుంటే అశ్వగంధం, శ్వేతగంధం, సిధ్దగంధం అని ఇలా ప్రతీ దానిలో ఎన్నో రకాల వైవిధ్యాలతో కూడినటువంటి పదార్థాలను వాడుతూ ఈ మంత్రం చదవండి, ఆ మంత్రం చదవండి అని చెప్పి ఎన్నో రకాల మంత్రాలు, స్తోత్రాలు ఉపయోగిస్తూ మనం ఇన్ని రకాలు గా దేవునికి పూజ చేస్తూ ఉన్నాం కదా!  మరి మనకు ఎందుకు దేవుడు కనిపించట్లేదు?  వరాలు ఎందుకు కురిపించట్లేదు?  అయితే ఇంకా ఈ కాలంలో చూస్తే వేలం వెర్రిగా ఎక్కడా దొరకని దుర్లభమైన వస్తువులు, ఎంతో విశేషమైన అలంకరణకు సంబంధించిన వస్తువులు అవన్నీ తెప్పించి ఎంతో ఆర్భాటంగా పూజ ఎంత భక్తితో చేశాము అనేది కాకుండా ఎంత ఆర్భాటంగా చేశాము అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎంత పెద్ద పందిరి వేశాము, ఎంత పెద్ద వి

గ్రామదేవతా నామ విశేషాలు:

Image
    మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది. 1. ఊరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి "పొలిమేరమ్మ" క్రమముగా "పోలేరమ్మ" అయింది. 2. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము.  అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. 3. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.  ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, 'పోచమ్మ' పోషణ కలిగిస్తుంది. 4. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసేయమ్మ - కాలక్రమములో "కట్టమైసమ్మ" అయింది. 5. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి "అచ్చమ్మ" గా అయ్యింది. 6. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.  'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను "మావూళ్ళమ్మ" అని పిలుస్తూంటే క్రమముగా అది "మావుళ్ళమ్మ" అయింది. 7. ప్రజల మనసులో పుట

మాఘ పురాణం - 1️⃣7️⃣వ అధ్యాయము

Image
    ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి, దిలీపునితో, మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము, గృత్నృమదుడను మహర్షి, గంగాతీరమున నివసించుచు, మాఘమాస స్నానము, పూజాదికము చేయుచు, తన శిష్యులకు, మాఘమాస మహిమను, శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును, వివరించుచుండెను. జహ్నువనుమహాముని, మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా, గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు, మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము, అత్యంత పుణ్యప్రదమే కాక, పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున, ప్రాతఃకాలమున, నదీస్నానము చేసినవారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా, పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నదీతీరమున, అన్ని వేదములను చదివిన, మిత్రవిందుడను ముని యొకడు, ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య, అతిలోకసుందరి, ఆమె యొకనాడు, తుంగభద్రా నదిలో స్నానము చేసి, పొడిబట్టలు కట్టుకొని, కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై, దేవతలతో గలసి యాకాశ మార్గమున పోవుచున్న యింద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని, నిశ్చయించుక

నిత్య రాశి ఫలాలు

Image
    2️⃣6️⃣/ఫిబ్రవరి /2️⃣0️⃣2️⃣4️⃣ఇందువాసరే (సోమవారము) 🐐 మేష రాశిఫలితములు. అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా) భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ).       గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు. అయినా వారు నడిచేటప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇతఃపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకుఈరోజుమంచిఫలితాలు అందుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. ఈరాశికి చెందినవారు మీగురించి మీరు కొద్దిగా అర్ధంచేసుకుంటారు.మీరుఏమైనా పోగొట్టుకుంటే,మీరు మీకొరకు సమయాన్నికేటాయించుకుని మీవ్యక్తిత్వాన్ని వృద్దిచేసుకోండి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది. ఈరోజు ఎక్కువగా మాట్లాడటంవలన మీకుతలనొప్పి సంభవించవచ్చును,కావున తక్కువ మాట్లాడము మంచిది.        లక్కీ సంఖ్య: 2